ముందే తాయిలాలు.. ఓటరు కార్డుల ఆధారంగా పేర్లు సేకరించిన వాలంటీర్లు

ఎన్నికలు సమీపిస్తుండటంతో వైకాపా నాయకులు ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల తాయిలాలు ఎరవేస్తున్నారు. నాలుగేళ్లుగా పట్టించుకోని నేతలు ఎన్నికల ఏడాది పండగ పేరుతో కానుకలు పంపిణీ చేస్తున్నారు.

Updated : 11 Jan 2024 07:21 IST

సంక్రాంతి కానుక పేరుతో చీరల పంపిణీ

వినుకొండ, న్యూస్‌టుడే: ఎన్నికలు సమీపిస్తుండటంతో వైకాపా నాయకులు ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల తాయిలాలు ఎరవేస్తున్నారు. నాలుగేళ్లుగా పట్టించుకోని నేతలు ఎన్నికల ఏడాది పండగ పేరుతో కానుకలు పంపిణీ చేస్తున్నారు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో..వాలంటీర్ల సాయంతో ఓటున్న మహిళలకు చీరలు పంచుతున్నారు. ముందుగా ఓటరు కార్డు ఆధారంగా పేర్లు సేకరించారు. వాటి ఆధారంగా సీఎం జగన్‌, ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఫొటోలు ముద్రించిన కూపన్లు అందజేస్తున్నారు. బొల్లాపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో నాలుగు రోజులుగా సంక్రాంతి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ కూపన్ల ఆధారంగా వైకాపా నేతల బొమ్మలున్న సంచితో పాటు చీరలు పంపిణీ చేస్తున్నారు. నియోజకవర్గంలో సుమారు లక్ష చీరలు పంచాలన్నది అధికార పార్టీ లక్ష్యంగా చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని