ODI World Cup: నీలి సముద్రంపై.. సూర్య కిరణాలు!

వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ సందర్భంగా భారత వాయుసేనకు చెందిన సూర్య కిరణ్‌ ఏరోబాటిక్స్‌ బృంద విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. దీనికి సంబంధించిన ఫొటోను బీసీసీఐ ఎక్స్‌లో పోస్టు చేసింది.

Updated : 19 Nov 2023 16:19 IST

అహ్మదాబాద్‌: వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ (ODI Worldcup final) ఉత్కంఠభరింతంగా సాగుతోంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రోహిత్‌ సేన.. 10 ఓవర్లలోపే కీలకమైన 3 వికెట్లు కోల్పోవడంతో అభిమానులు తీవ్ర అందోళనకు గురవుతున్నారు. తొలిడౌన్‌లో వచ్చిన కోహ్లీ (54) కూడా ఔటవ్వడంతో.. ఉత్కంఠ మరింత పెరిగింది. మరోవైపు పెద్ద ఎత్తున వచ్చిన క్రికెట్‌ అభిమానులతో అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ మైదానం కిక్కిరిసిపోయింది.

టీమ్‌ఇండియాకు మద్దతు పలికేందుకు వేలాది మంది అభిమానులు నీలం రంగు దుస్తులు ధరించి వచ్చారు. దీంతో గ్యాలరీ మొత్తం నీలిరంగులో మెరిసిపోతూ జనసంద్రాన్ని తలపిస్తోంది. అంతేకాకుండా ఇండియన్‌ ఆర్మీకి చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్స్ బృందం ఎయిర్ షో ఆకట్టుకుంది. నీలి సముద్రం మీదుగా.. సూర్యకిరణాలు ప్రసరిస్తున్నాయా? అన్నట్లుగా.. ఏరోబాటిక్స్‌ బృందం చేసిన విన్యాసం అందర్నీ అబ్బురపరుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాలో పోస్టు చేసింది.

మరిన్ని చిత్రాల కోసం క్లిక్‌ చేయండి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని