Akaay: అకాయ్‌.. కోహ్లి, అనుష్క కుమారుడి పేరుకు అర్థమేంటో తెలుసా?

Akaay: అనుష్క మగబిడ్డకు జన్మనిచ్చిందని కోహ్లి మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో తెలిపాడు. అతనికి అకాయ్‌గా నామకరణం చేసినట్లు వెల్లడించాడు.

Published : 21 Feb 2024 07:54 IST

దిల్లీ: రెండోసారి తల్లిదండ్రులైన సెలబ్రిటీ జంట విరాట్‌ కోహ్లి (Virat Kohli), అనుష్క శర్మ తమ బిడ్డకు అకాయ్‌గా (Akaay) నామకరణం చేశారు. ఈ పేరుకు అర్థం ఏంటని నెట్టింట తెగ చర్చ జరుగుతోంది. దీనిపై ఆ రంగంలో నిపుణులు రెండు రకాల అర్థాలను చెబుతున్నారు. సంస్కృతంలో ఈ పదానికి ‘అమరుడు’, ‘చిరంజీవుడు’ అనే అర్థం ఉందని వెల్లడించారు. అలాగే హిందీలో ‘కాయ్‌’ అంటే శరీరమని.. ‘అకాయ్‌’ అంటే భౌతిక శరీరానికి మించినవాడు అని వివరించారు. మరోవైపు టర్కీ భాషలో ఈ పదానికి ‘ప్రకాశిస్తున్న చంద్రుడు’ అనే అర్థం కూడా ఉందట. మరి విరుష్క జంట ఏ అర్థంలో తమ బిడ్డకు అకాయ్‌గా నామకరణం చేశారో అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.    

ఈ నెల 15న అనుష్క (Anushka Sharma) మగబిడ్డకు జన్మనిచ్చిందని కోహ్లి మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో తెలిపాడు. వీరికి ఇప్పటికే మూడేళ్ల కుమార్తె వామిక ఉంది. ‘‘ఫిబ్రవరి 15న మా బాబు, వామిక తమ్ముడు అకాయ్‌ని ఈ ప్రపంచంలోకి ఆహ్వానించాం. ఈ విషయం అందరికీ చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఈ అందమైన సమయంలో మీ ఆశీర్వాదాలు కావాలి. మా ఏకాంతాన్ని గౌరవించమని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని కోహ్లి చెప్పాడు. కోహ్లి వ్యక్తిగత కారణాలతో భారత్‌-ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఈ జంటకు ప్రముఖులు, అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని