Asia Cup 2023: ఆసియా కప్‌ 2023.. ప్రోమో చూశారా..?

హైబ్రిడ్ విధానంలో జరిగే ఆసియా కప్‌ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా భారత్ - పాకిస్థాన్‌ మ్యాచ్‌ కోసం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఆసియా కప్‌ 2023 పోటీలకు (Asia Cup 2023) సంబంధించి ప్రోమో విడుదలైంది.

Published : 17 Jun 2023 14:49 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆగస్ట్‌ 31 నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు ఆసియా కప్‌ 2023 (Asia Cup 2023) జరగనుంది. ఆరుదేశాలు పాల్గొనే మినీ టోర్నీ కోసం పాకిస్థాన్‌, శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్నాయి. పాక్‌లో నాలుగు మ్యాచ్‌లు, శ్రీలంకలో తొమ్మిది మ్యాచ్‌లు లెక్కన హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహించేందుకు ఏషియన్‌ క్రికెట్ కౌన్సిల్ (ACC) నిర్ణయం తీసుకుంది. ప్రసార హక్కులను స్టార్‌స్పోర్ట్స్‌ దక్కించుకుంది. ఈ క్రమంలో ఆసియా కప్ థీమ్‌ను వెల్లడిస్తూ ఓ వీడియో ప్రోమోను క్రీడా ఛానెల్‌ విడుదల చేసింది. ఇప్పుడది నెట్టింట వైరల్‌గా మారింది. 

టీమ్‌ఇండియా ప్రయాణంతోపాటు ఆసియా దేశాల మినీ టోర్నీ (Asia Cup 2023) గురించి వీడియోలో పేర్కొంది. ప్రపంచ కప్‌ కంటే ముందు జరిగే ఆసియా కప్‌ను కొట్టండి..  అంటూ భారత జట్టును ప్రోత్సహించింది. భారత్‌ - పాకిస్థాన్‌ (IND vs PAK) జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా ఉంటుందని, ఎంజాయ్‌ చేయండని చెబుతూ వీడియోను ముగించింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని