IPL: ఇకపై టాస్‌ గెలిచాకే.. ఐపీఎల్‌ నిబంధనల్లో మార్పులు చేసిన బీసీసీఐ

ఐపీఎల్‌ కెప్టెన్లు ఇక టాస్‌ పడ్డాక తుది జట్లను ప్రకటించవచ్చు. ఈ మేరకు నిబంధనల్లో బీసీసీఐ మార్పులు చేసింది.

Published : 23 Mar 2023 10:20 IST

దిల్లీ: ఐపీఎల్‌ కెప్టెన్లు ఇక టాస్‌ పడ్డాక తుది జట్లను ప్రకటించవచ్చు. ఈ మేరకు నిబంధనల్లో బీసీసీఐ మార్పులు చేసింది. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం కెప్టెన్లు టాస్‌కు ముందే తుది జట్టు వివరాలను ప్రకటించాలి. ‘‘రెండు జట్ల కెప్టెన్లు.. 11 మందితో కూడి తుది జట్టు, అయిదుగురు సబ్‌స్టిట్యూట్ల వివరాలను టాస్‌ తర్వాత లిఖిత పూర్వకంగా ఐపీఎల్‌ మ్యాచ్‌ రిఫరీకి అందించవచ్చు. ముందు తుది జట్టును వెల్లడించినా.. మ్యాచ్‌ ఆరంభానికి ముందు ప్రత్యర్థి కెప్టెన్‌ అనుమతి లేకుండా మార్పులు చేసుకోవచ్చు’’ అని బీసీసీఐ తెలిపింది. నిబంధనల మార్పుతో టాస్‌ ఆధారంగా తుది జట్టును ఎంచుకోవడానికి అవకాశం లభించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని