ఫుట్‌బాల్ దిగ్గజం మారడోనా కన్నుమూత
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం డిగో మారడోనా (60) కన్నుమూశారు. గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో.........
ఇంటర్నెట్ డెస్క్: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం డిగో మారడోనా (60) కన్నుమూశారు. గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఇటీవలే ఆయన శస్త్రచికిత్స చేయించుకున్నారు. 1960 అక్టోబర్ 30న అర్జెంటీనాలో జన్మించిన మారడోనా.. 1986లో అర్జెంటీనాకు ఫిఫా వరల్డ్ కప్ అందించారు. మెరుపు గోల్స్ కొడుతూ ఫుట్‌బాల్ ఆటలో ‘ది గోల్డెన్ బాయ్’గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టుకు మేనేజర్‌గా ఉన్నారు. ఆల్‌టైమ్ గ్రేట్ ఫుట్‌బాల్ ఆటగాడిగా ఆయన ప్రపంచస్థాయి కీర్తి గడించారు.
నాలుగు సార్లు ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో పాల్గొన్న డిగో.. 1990 ప్రపంచ కప్‌లో అర్జెంటీనా జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లారు. ఆయన బొకా జూనియర్స్, నాపోలి, బార్సిలోనా క్లబ్ జట్ల తరఫున పలు మ్యాచ్‌లు ఆడారు. 1991లో మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డ ఆయన 15నెలల పాటు ఆట నుంచి నిషేధానికి గురయ్యారు. అలా.. అమెరికాలో జరిగిన ప్రపంచకప్ టోర్నీకి కూడా దూరమయ్యారు. 1997లో ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికారు. 2004లో శ్వాసకోశ, హృద్రోగ సమస్యల బారినపడ్డారు. 2008లో అర్జెంటీనా జాతీయ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించారు. యూఏఈ, మెక్సికో జాతీయ జట్లకు మేనేజర్‌గానూ పనిచేశారు.
డీగో.. నీ టాలెంట్ సూపర్.. వీడియో
చూసేందుకు ఆయనేమీ ఆజానుబాహుడు కాదు. భారీగా శారీరక ధారుడ్యం కలిగినవాడూ కాదు. అయితేనేమీ ప్రపంచమంతా తన గురించి మాట్లాడుకునేలా చేశాడు తన ఫుట్‌బాల్ ఆటతో. ఆయనే అర్జెంటీనాకు చెందిన డీగో అర్మాండో మారడోనా. ప్రతి ఫుట్‌బాల్ అభిమానికి డీగో పేరు తెలియకుండా ఉండదు. అప్పట్లో మారడోనా మైదానంలోకి దిగాడంటే ఒకటే కేరింతలు.. ప్రత్యర్థులకు అందకుండా గోల్ కొట్టడంలో ఎంతో నైపుణ్యం కలిగిన దిగ్గజ ఆటగాడు. అక్టోబర్ 30న 60వ వసంతంలోకి అడుగు పెట్టిన ఆయన అంతలోనే అస్తమయం కావడం యావత్ ప్రపంచ క్రీడాభిమానులను విస్మయానికి గురిచేస్తోంది. ఇటీవల ఆయన 60వ పుట్టిన రోజు సందర్భంగా వైరల్ అయిన వీడియో ఇది. 1989వ సంవత్సరంలో మారడోనా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో తీసిన ఈ వీడియో నెట్టింట్లో వైరలైంది. బంతిని ఎంతో నేర్పుగా ఒడిసి పడుతున్న వైనం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
166.. 58 బంతుల్లో ఉఫ్
47 నిమిషాలు.. 58 బంతులు.. 167 పరుగులు.. 0 వికెట్లు! బుధవారం ఉప్పల్ స్టేడియంలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటింగ్ విధ్వంసమిది. ఇన్నింగ్స్ విరామంలో అభిమానులు స్నాక్స్ తెచ్చుకునేలోపే.. టీవీ సెట్ల ముందున్న ప్రేక్షకులు కాస్త బ్రేక్ తీసుకునేలోపే సన్‌రైజర్స్ లక్ష్య ఛేదన పూర్తయింది. -
ముంబయి తప్ప..
ఐపీఎల్-17 లీగ్ దశలో ఇంకా 13 మ్యాచ్‌లే మిగిలాయి. కానీ ఇప్పటికీ ఏ జట్టూ అధికారికంగా ప్లేఆఫ్స్ చేరలేదు. లఖ్‌నవూపై సన్‌రైజర్స్ విజయంతో ముంబయి అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
సంగీతం వింటూ.. సిరీస్‌లు చూస్తూ
ఒలింపిక్స్ పతకం నెగ్గాలన్నది ప్రతి అథ్లెట్ కల. అందుకోసం ఒక్కో అథ్లెట్ ఒక్కోలా సాగుతారు. తీవ్రమైన సాధన చేస్తూనే మెదడును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం ఇతర వ్యాపకాల్లోనూ మునిగిపోతారు. -
మూడేళ్లలో తొలిసారి..
ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మూడేళ్లలో తొలిసారి స్వదేశంలో పోటీపడనున్నాడు. భువనేశ్వర్‌లో ఈ నెల 12 నుంచి 15 వరకు జరిగే జాతీయ ఫెడరేషన్ కప్‌లో అతడు ఆడనున్నాడు. -
ఓడలో ఫ్రాన్స్‌కు ఒలింపిక్ జ్యోతి
1896లో తొలిసారి ఉపయోగించిన మూడు వరుసల తెరచాపలతో కూడిన పురాతన ఓడ.. మధ్యధరా సముద్రంలో 12 రోజుల పాటు ప్రయాణం.. చివరగా గమ్యాన్ని చేరుకుని ఫ్రాన్స్‌లో ఒలింపిక్ జ్యోతి వెలుగులు నింపింది. -
నా రికార్డులను జైస్వాల్ బద్దలు కొడతాడు
టీమ్ఇండియా యువ ఓపెనర్, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించే యశస్వి జైస్వాల్‌కు గొప్ప భవిష్యత్తు ఉందని వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రయాన్ లారా కొనియాడాడు. -
శాంసన్.. మాస్టర్ బ్లాస్టర్!
ఈ ఐపీఎల్లో భీకర ఫామ్‌తో సాగిపోతున్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్‌పై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతణ్ని మాస్టర్బ్లాస్టర్గా అభివర్ణించాడు. -
అమన్‌పై ఆశలు
ప్రపంచ రెజ్లింగ్ క్వాలిఫయర్స్ గురువారం ఆరంభం కానున్నాయి. పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల కోసం ఇదే చివరి అర్హత ఈవెంట్. భారత ఫ్రీస్టైల్ రెజ్లర్లలో అమన్ శెరావత్, దీపక్ పునియాలపై పెద్ద ఆశలే ఉన్నాయి. -
ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
సొంత గడ్డపై హైదరాబాద్ ఎప్పటికీ మరిచిపోలేని అద్భుతమైన విజయాన్ని అందుకుంది. లఖ్‌నవూను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువైంది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ పలు రికార్డులు నమోదు చేసింది. -
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
ఒకే ఒక్క క్యాచ్ రాజస్థాన్‌ను ఓటమి వైపు నడిపించగా.. గెలుస్తామనే ఆశలు లేని సమయంలో దిల్లీకి ఊపిరి పోసింది. దీంతో ఆ జట్టు విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. -
నా ‘400’ రికార్డును కొట్టే సత్తా ఈ భారత కుర్రాడి సొంతం: బ్రియాన్ లారా
టీమ్ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌పై బ్రియాన్ లారా అభినందనల వర్షం కురిపించాడు. భవిష్యత్తులో ఎన్నో రికార్డులను కొల్లగొడతాడని పేర్కొన్నాడు.