IPL: కోహ్లీ, ధోనీ, డుప్లెసిస్‌నే ఔట్‌ చేశాడు

ఐపీఎల్‌ ఎప్పటిలాగే ఈ సారీ కొత్త ప్రతిభను వెలికితీసిందని మాజీ క్రికెటర్‌ ఆకాశ్ చోప్రా అన్నాడు. దిల్లీ  క్యాపిటల్స్‌ యువ పేసర్‌ అవేశ్‌ ఖాన్‌...

Published : 19 May 2021 13:58 IST

అవేశ్‌ను తేలిగ్గా తీసుకోవద్దన్న ఆకాశ్

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌ ఎప్పటిలాగే ఈ సారీ కొత్త ప్రతిభను వెలికితీసిందని మాజీ క్రికెటర్‌ ఆకాశ్ చోప్రా అన్నాడు. దిల్లీ  క్యాపిటల్స్‌ యువ పేసర్‌ అవేశ్‌ ఖాన్‌ తన బౌలింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడని ప్రశంసించాడు. అతడిని తేలిగ్గా తీసుకోవద్దని సూచించాడు. లీగులో డుప్లెసిస్‌, ధోనీ, కోహ్లీ వికెట్లు తీశాడని గుర్తు చేశాడు.

‘ఈ సారి అవేశ్‌ ఖాన్‌ బయటకొచ్చాడు. పోటీలో నిలబడ్డాడు. మళ్లీ మళ్లీ సత్తా చాటాడు. తనను తేలిగ్గా తీసుకోవద్దని నిరూపించాడు. తొలి మ్యాచ్‌ నుంచే అతడు నిలకడగా వికెట్లు తీశాడు. కొత్త బంతైనా, పాత బంతైనా, మధ్య ఓవర్లైనా, ఆఖరి ఓవర్లైనా అతడు చక్కగా బౌలింగ్‌ చేశాడు. భారీ వికెట్లు పడగొట్టాడు. డుప్లెసిస్‌, ధోనీ, కోహ్లీని పెవిలియన్‌ పంపించాడు. ప్రత్యర్థి బ్యాటింగ్‌ లైనప్‌లోని అత్యుత్తమ ఆటగాళ్లను క్రమం తప్పకుండా ఔట్‌ చేశాడు. దిల్లీ క్యాపిటల్స్‌ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు’ అని ఆకాశ్‌ చోప్రా అన్నాడు.

ఐపీఎల్‌లో అవేశ్‌ 7.70 ఎకానమీతో 14 వికెట్లు తీశాడు. అత్యధిక వికెట్లు తీసిన వారి జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. అతడి ప్రదర్శనలను గుర్తించిన బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఇంగ్లాండ్‌ పర్యటనకు స్టాండ్‌బైగా ఎంపిక చేసింది. కరోనా వైరస్‌ కారణంగా ఐపీఎల్‌ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని