Ravi Shastri: అప్పుడే ఐపీఎల్‌ మరో స్థాయికి: రవిశాస్త్రి

ఐపీఎల్‌ను 2009లో దక్షిణాఫ్రికాలో విజయవంతంగా నిర్వహించడం టోర్నీని మరో స్థాయిని తీసుకెళ్లిందని టీమ్‌ ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు.

Updated : 19 Apr 2023 07:14 IST

దిల్లీ: ఐపీఎల్‌ను 2009లో దక్షిణాఫ్రికాలో విజయవంతంగా నిర్వహించడం టోర్నీని మరో స్థాయిని తీసుకెళ్లిందని టీమ్‌ ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. దేశంలో ఎన్నికలు ఉండడంతో ఐపీఎల్‌ను అప్పట్లో దక్షిణాఫ్రికాకు తరలించిన సంగతి తెలిసిందే. శాస్త్రి అప్పుడు ఐపీఎల్‌ పాలకవర్గం సభ్యుడు. ‘‘అత్యుత్తమ ఆటగాళ్లతో ఐపీఎల్‌ ఘనంగా ఆరంభమైంది. కానీ టోర్నీని దక్షిణాఫ్రికాలో నిర్వహించినప్పుడు మరో స్థాయికి వెళ్లింది. దక్షిణాఫ్రికాలో కూడా ఐపీఎల్‌ను భారత్‌లో చూసినంత ఆసక్తిగా చూడడం ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. ఎందుకంటే అప్పటికి ప్రపంచవ్యాప్తంగా జనం తమకు నచ్చిన ఐపీఎల్‌ జట్లను ఎంచుకోవడం మొదలుపెట్టారు. సాధారణంగా ఫుట్‌బాల్‌లో అది జరుగుతుంది. కానీ ఐపీఎల్‌లో జట్లను ఎంచుకోవడం రెండో సీజన్‌లోనే మొదలైంది’’ అని రవిశాస్త్రి అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని