Virat Kohli: తప్పు జెర్సీ వేసుకుని.. డగౌట్‌కు పరుగెత్తిన కోహ్లి

పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి మధ్యలో పెవిలియన్‌కు పరుగెత్తాల్సి వచ్చింది. తప్పు జెర్సీ వేసుకోవడమే ఇందుకు కారణం. ప్రపంచకప్‌ కోసం టీమ్‌ఇండియా ఆటగాళ్లకు భుజంపై మువ్వన్నెల గుర్తు ఉండే జెర్సీని రూపొందించారు.

Updated : 15 Oct 2023 05:51 IST

అహ్మదాబాద్‌: పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి మధ్యలో పెవిలియన్‌కు పరుగెత్తాల్సి వచ్చింది. తప్పు జెర్సీ వేసుకోవడమే ఇందుకు కారణం. ప్రపంచకప్‌ కోసం టీమ్‌ఇండియా ఆటగాళ్లకు భుజంపై మువ్వన్నెల గుర్తు ఉండే జెర్సీని రూపొందించారు. కానీ విరాట్‌ పొరపాటున తెల్ల స్ట్రిప్స్‌ ఉన్న జెర్సీని వేసుకుని బరిలో దిగాడు. పొరపాటును గుర్తించిన అతడు ఏడో ఓవర్‌ ముగిశాక డగౌట్‌కు వెళ్లి జెర్సీ మార్చుకుని వచ్చాడు. ఆ తర్వాతి ఓవర్లోనే సిరాజ్‌.. షఫీఖ్‌ను ఔట్‌ చేసి భారత్‌కు తొలి వికెట్‌ అందించాడు.


హార్దిక్‌ మాట విన్న బంతి..

మ్యాచ్‌లో బంతి.. టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ మాట విన్నదా? అతను చెప్పినట్లుగానే వికెట్‌ సంపాదించిందా? అనే ప్రశ్నలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అతను బంతితో మాట్లాడటం.. ఆ వెంటనే వికెట్‌ దక్కడమే అందుకు కారణం. హార్దిక్‌ వేసిన 13వ ఓవర్‌ రెండో బంతికి ఇమాముల్‌ హక్‌ ఫోర్‌ కొట్టాడు. ఆ తర్వాత బౌలింగ్‌ చేసేందుకు సిద్ధమైన హార్దిక్‌.. బంతిని నోటికి దగ్గరగా పెట్టుకుని ఏదో అన్నాడు. ఆ వెంటనే ఇమాముల్‌ హక్‌ దూరంగా వెళ్తున్న బంతిని వేటాడి వికెట్‌ కీపర్‌ రాహుల్‌ చేతికి చిక్కాడు. దీంతో అందరూ హార్దిక్‌ గురించి మాట్లాడుతున్నారు. బంతికి మంత్రం వేశాడని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.


వీక్షణలోనూ రికార్డు

దిల్లీ: భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ప్రపంచకప్‌ హైఓల్టేజ్‌ మ్యాచ్‌ వీక్షణలోనూ కొత్త రికార్డు నెలకొల్పింది. మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న డిజిటల్‌ వేదిక డిస్నీ హాట్‌స్టార్‌లో ఒకేసారి 3.5 కోట్ల మంది తిలకించారు. ఈ ఏడాది ఆరంభంలో చెన్నై సూపర్‌కింగ్స్‌-గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య ఐపీఎల్‌ ఫైనల్‌ను అత్యధికంగా 3.2 కోట్ల మంది వీక్షించగా.. ఇప్పుడా రికార్డును భారత్‌-పాక్‌ మ్యాచ్‌ అధిగమించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని