IND vs PAK: ఇంత సమయమా రిజ్వాన్‌!

పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌లో 13వ ఓవర్లో రెండు తమాషా సంఘటనలు జరిగాయి. హార్దిక్‌ పాండ్య వేసిన ఆ ఓవర్లో మూడో బంతికి ఇమామూల్‌ హక్‌ ఔటయ్యాడు.

Updated : 15 Oct 2023 07:57 IST

పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌లో 13వ ఓవర్లో రెండు తమాషా సంఘటనలు జరిగాయి. హార్దిక్‌ పాండ్య వేసిన ఆ ఓవర్లో మూడో బంతికి ఇమామూల్‌ హక్‌ ఔటయ్యాడు. ఈ బంతి వేయడానికి ముందు పాండ్య.. బంతిని రెండు చేతుల్లో దాచుకుని.. ఏదో మంత్రం చదివినట్టుగా కనిపించాడు. అనూహ్యంగా ఇమామూల్‌ ఔట్‌సైడ్‌ ఎడ్జ్‌తో వికెట్‌కీపర్‌ రాహుల్‌కు చిక్కాడు. అతడి స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు మహ్మద్‌ రిజ్వాన్‌. గార్డ్‌ తీసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకున్నాడు. దీంతో కెప్టెన్‌ రోహిత్‌.. అంపైర్‌తో ఈ విషయంపై మాట్లాడాడు. మాజీ కెప్టెన్‌ విరాట్‌ మణికట్టుపై ఏదో వాచ్‌ ఉన్నట్లుగా దాన్ని చూస్తూ ‘ఇంత సమయమా’ అన్నట్లు సంజ్ఞ చేశాడు. కోహ్లి వాచ్‌ స్పందన సామాజిక మాధ్యమాల్లో విస్తృతం అయ్యింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని