Olympics: ఒలింపిక్స్‌ దిశగా గుజరాత్‌ ఏర్పాట్లు

2036 ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు గుజరాత్‌ సిద్ధమవుతోంది! రూ.6 వేల కోట్ల వ్యయంతో ఆరు స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు నిర్మించేందుకు ‘గుజరాత్‌ ఒలింపిక్‌ ప్రణాళిక, మౌలిక సదుపాయాల కార్పొరేషన్‌ లిమిటెడ్‌’ పేరుతో ఓ సంస్థను కూడా అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Updated : 10 Jan 2024 07:08 IST

గాంధీనగర్‌: 2036 ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు గుజరాత్‌ సిద్ధమవుతోంది! రూ.6 వేల కోట్ల వ్యయంతో ఆరు స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు నిర్మించేందుకు ‘గుజరాత్‌ ఒలింపిక్‌ ప్రణాళిక, మౌలిక సదుపాయాల కార్పొరేషన్‌ లిమిటెడ్‌’ పేరుతో ఓ సంస్థను కూడా అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదేంటీ.. ఇంకా 2036 ఒలింపిక్స్‌ను ఎవరికి కేటాయించలేదు కదా అనుకుంటున్నారా? అవును.. ఒకవేళ భారత్‌ బిడ్‌ గెలిచి, ఆ ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశం వస్తే చేయాల్సిన ఏర్పాట్ల కోసం గుజరాత్‌ ప్రభుత్వం ముందుగానే సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సంస్థ ఓ సారి బోర్డు సమావేశాన్ని కూడా నిర్వహించింది.అహ్మదాబాద్‌లోని మొతెరాలో ఉన్న సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌ స్పోర్ట్స్‌ ఎన్‌క్లేవ్‌ చుట్టూ ఉన్న 350 ఎకరాల్లో క్రీడా వసతుల అభివృద్ధిపై ఈ సంస్థ ప్రధానంగా దృష్టి సారించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని