Team India: తిరిగి జట్టుతో కలిసిన జస్ప్రీత్‌ బుమ్రా.. సచిన్‌ తెందూల్కర్‌కు గోల్డెన్ టికెట్

స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) తిరిగి శ్రీలంకకు పయనమై జట్టుతో కలిశాడు. బుమ్రా భార్య సంజనా గణేశన్‌ ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

Updated : 08 Sep 2023 13:55 IST

కొలంబో: ఆసియా కప్‌ సూపర్‌-4లో భాగంగా ఆదివారం (సెప్టెంబరు 10న) భారత్, పాకిస్థాన్‌ (IND vs PAK) మ్యాచ్ జరగనుంది. ఈ దాయాదుల పోరు కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ హై వోల్టెజీ మ్యాచ్‌కు ముందు టీమ్‌ఇండియాకు గుడ్‌న్యూస్‌. స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) తిరిగి జట్టుతో కలిశాడు. ఇటీవల బుమ్రా భార్య సంజనా గణేశన్‌ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అప్పుడు బుమ్రా తన భార్య చెంత ఉండేందుకు శ్రీలంక నుంచి ముంబయి చేరుకున్నాడు. దీంతో అతడు నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌కు దూరమైన సంగతి తెలిసిందే. అయితే, పాక్‌తో కీలకమైన మ్యాచ్‌ ఉండటంతో బుమ్రా తిరిగి శ్రీలంకు పయనమై కొలంబోలో జట్టుతో కలిశాడు. ఆసియా కప్ గ్రూప్‌ దశలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌కు బుమ్రా అందుబాటులో ఉన్నా వర్షం కారణంగా పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌ మొదలుకాకపోవడంతో అతడికి బౌలింగ్‌ చేసే అవకాశం రాలేదు. సూపర్‌-4లోనూ భారత్‌, పాక్‌ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లోనైనా బుమ్రా బౌలింగ్‌ను చూస్తామో లేదో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 

Asia Cup 2023 - BCCI: ఏదో అనుకుంటే..

సచిన్‌ తెందూల్కర్‌కు గోల్డెన్ టికెట్

భారత్ వేదికగా అక్టోబర్‌ 5 నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీని విజయవంతంగా నిర్వహించడం కోసం బీసీసీఐ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. అదే విధంగా దేశంలోని ప్రముఖులకు గోల్డెన్‌ టికెట్‌లను అందించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా బీసీసీఐ కార్యదర్శి జై షా.. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ (Sachin Tendulkar)ను కలిసి వన్డే ప్రపంచకప్‌ గోల్డెన్ టికెట్‌ను అందజేశారు. ఇటీవల జై షా.. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ను కలిసి గోల్డెన్‌ టికెట్‌ను అందజేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు