Marcus Stoinis: లఖ్‌నవూ, మొహాలీ పిచ్‌లపై జోకులు వేసుకున్నాం: మార్కస్‌ స్టొయినిస్‌

సొంత గడ్డపై ఓటమి పాలై మొహాలీ పిచ్‌పై విజయం సాధించడంపై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ ఆటగాళ్లు జోకులు వేసుకున్నారు. ఈ విషయాన్ని లఖ్‌నవూ ఆటగాడు స్టొయినిస్‌ వెల్లడించాడు.

Published : 29 Apr 2023 13:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌-16 (IPL)లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ (PBKS)పై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ (LSG) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. లఖ్‌నవూ సొంతగడ్డపై ఇటీవల గుజరాత్‌ టైటాన్స్‌ (GT)తో ఓటమి పాలైన విషయం విధితమే. ఆ పరాభవం తర్వాత తాజాగా భారీ విజయం నమోదవడంతో లఖ్‌నవూ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. లఖ్‌నవూ, మొహాలీ పిచ్‌లను పోల్చుతూ ఎల్‌ఎస్‌జీ ఆటగాళ్లు జోకులు వేసుకున్నారట. సొంత గడ్డపై ఓటమి పాలై మొహాలీ (Mohali) పిచ్‌పై విజయం సాధించడమేంటని సరదాగా మాట్లాడుకున్నారట. ఈ విషయాన్ని ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ మార్కస్‌ స్టొయినిస్ (Marcus Stoinis) వెల్లడించాడు.

‘‘గతవారం సొంత గడ్డపై జరిగిన మ్యాచ్‌లో మేము ఓటమిని చవిచూశాం. కానీ, ఈ రోజు మొహాలీ పిచ్‌పై విజయం సాధించాం. ఈ రెండు పిచ్‌ల గురించి మేము డ్రెస్సింగ్ రూంలో సరదాగా మాట్లాడుకున్నాం. వాటి మధ్య ఉన్న తేడాపై జోకులు వేసుకున్నాం. అయితే మ్యాచ్‌లో మేము మంచి భాగస్వామ్యం నిర్మించడానికి ప్రయత్నించాం. మ్యాచ్‌ ఆరంభం నుంచి మేము దానిపైనే దృష్టి పెట్టాం. ఇక, బదోని మంచి షాట్లు ఆడాడు. అతడు ప్రతిభావంతుడు’’ అని స్టొయినిస్‌ వెల్లడించాడు.

ఎల్‌ఎస్‌జీ (LSG), జీటీ (GT) మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలి బంతికే డకౌట్ అయిన స్టొయినిస్‌ నిన్నటి మ్యాచ్‌లో 72 పరుగులు సాధించాడు. 6 ఫోర్లు, 5 సిక్సులు బాదాడు. కేల్‌ మేయర్స్‌ (54) , ఆయుష్‌ బదోని (43), నికోలస్‌ పూరన్‌ (45) రాణించడంతో లఖ్‌నవూ 257 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఐపీఎల్‌ చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోరు. టీ20 క్రికెట్‌లో 9వ అత్యధిక స్కోరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని