Rafael Nadal: టెన్నిస్ క్రీడాకారుడు నాదల్‌కు కరోనా పాజిటివ్‌

దిగ్గజ టెన్నిస్ క్రీడాకారుడు రఫేల్ నాదల్ కరోనా బారిన పడ్డాడు. అబుదాబిలో నిర్వహించిన దుబాయ్‌ టోర్నమెంట్‌లో పాల్గొన్న నాదల్ గాయం కారణంగా మధ్యలోనే స్పెయిన్ వచ్చేశాడు. అనంతరం

Published : 20 Dec 2021 23:19 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దిగ్గజ టెన్నిస్ క్రీడాకారుడు రఫేల్ నాదల్ కరోనా బారిన పడ్డాడు. అబుదాబిలో నిర్వహించిన దుబాయ్‌ టోర్నమెంట్‌లో పాల్గొన్న నాదల్ గాయం కారణంగా మధ్యలోనే స్పెయిన్ వచ్చేశాడు. అనంతరం పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా తేలిందని ట్వీట్ చేశాడు. తనతో సన్నిహితంగా ఉన్న వారంతా పరీక్షలు చేయించుకోవాలని సూచించాడు.

‘దుబాయ్‌ టోర్నమెంట్ నుంచి తిరిగిగొచ్చిన నేను.. ఇటీవల ఆర్టీ పీసీఆర్ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాను. అయితే, రోజు రోజుకు పరిస్థితి మెరుగవుతుందనుకుంటున్నాను. ప్రస్తుతానికి హోం ఐసోలేషన్‌లో ఉంటున్నాను. నాతో సన్నిహితంగా ఉన్న వారంతా కరోనా పరీక్షలు చేయించుకోండి’ అని నాదల్ ట్వీట్ చేశాడు. భవిష్యత్తులో ఆడబోయే టోర్నమెంట్ల గురించిన సమాచారాన్ని త్వరలోనే తెలియజేస్తానని నాదల్ పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని