Ravindra Jadeja: యూఎస్ వీధుల్లో చిందేసిన టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా

ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చిన రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ప్రస్తుతం రిలాక్స్‌ అవుతున్నాడు. కుటుంబసభ్యులతో కలిసి యూఎస్‌కు వెకేషన్‌కు వెళ్లాడు.

Published : 08 Aug 2023 01:52 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చిన రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ప్రస్తుతం రిలాక్స్‌ అవుతున్నాడు. విండీస్‌తో వన్డే, టీ20ల సిరీస్‌లకు అతడికి విశ్రాంతినిచ్చారు. ఈ ఖాళీ సమయాన్ని జడేజా సద్వినియోగం చేసుకుంటున్నాడు. కుటుంబసభ్యులతో కలిసి యూఎస్‌కు వెకేషన్‌కు వెళ్లాడు. అక్కడ పర్యాటక ప్రదేశాల్లో చక్కర్లు కొడుతూ ఎంజాయ్‌ చేస్తున్నాడు. ‘‘ముక్కాల ముక్కాబులా లైలా’’ అనే సూపర్‌ హిట్‌ సాంగ్‌కు జడ్డూ డ్యాన్స్‌ ఫ్లోర్‌పై స్టెప్పులేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎల్‌లో జడేజా ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నై సూపర్‌ కింగ్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పంచుకుంది. జడేజా చాలా బాగా డ్యాన్స్‌ చేశాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని