
IPL 2021: అనుకున్నది ఒకటి.. జరిగింది మరొకటి: సంజూ శాంసన్
ఇంటర్నెట్‌డెస్క్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో తాను అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి అని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు. సోమవారం రాత్రి తలపడిన మ్యాచ్‌లో హైదరబాద్ రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. రాజస్థాన్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 18.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ జేసన్ రాయ్ (60), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (51) అర్ధశతకాలతో రాణించి జట్టుకు ఈ సీజన్‌లో రెండో విజయాన్ని అందించారు. మరోవైపు రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో ఓటమిపాలై ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే సంజూ మాట్లాడుతూ తాము మంచి స్కోరే సాధించామని చెప్పాడు.
‘మేం సాధించింది మంచి స్కోరే అనుకుంటున్నా. ఈ పిచ్ కాస్త నెమ్మదిగా ఉంది. మరోవైపు హైదరాబాద్ బౌలర్లు బాగా రాణించారు. మేం ఇంకాస్త ప్రయత్నించి ఉంటే మరో 20 పరుగులు అదనంగా వచ్చేవి. ఇలాంటి పిచ్‌పై శుభారంభం దక్కితే దాన్ని అలాగే కొనసాగించాలి. ఈ క్రమంలోనే నేను పవర్‌ప్లే తర్వాత చెలరేగిపోవాలనుకున్నా.. కానీ మరో ఎండ్‌లో వికెట్లు కోల్పోయాం. దీంతో నేను క్రీజులో నిలబడి భాగస్వామ్యాలు జోడించాలనుకున్నా. ఎలాగైనా గెలవాలని మంచి స్కోర్ హైదరాబాద్ ముందు ఉంచాలనుకున్నాం. చివరికి మేం అనుకున్న స్కోర్ బోర్డుపై ఉంచగలిగాం. కానీ, ఈ ప్రదర్శన సరిపోలేదు. మా బ్యాటింగ్, బౌలింగ్‌పై దృష్టిపెట్టాలి. ప్రతి బంతిపైనా శ్రద్ధచూపాలి’ అని సంజూ వివరించాడు.
మళ్లీ గెలవడం చాలా బాగుంది: విలియమ్సన్
సన్‌రైజర్స్ కెప్టెన్ విలియమ్సన్ ఈ టోర్నీలో రెండో విజయం సాధించడం సంతోషంగా ఉందన్నాడు. ‘ఇప్పుడు చాలా బాగుంది. ఈ మ్యాచ్‌లో మా జట్టులోని ప్రతి ఒక్కరు ఎలా ఆడాలనే దానిపై ముందే స్పష్టతతో ఉన్నాం. ఈ మ్యాచ్‌లో కొన్ని సందర్భాలు కీలకంగా మారాయి. తొలుత బంతితో రాజస్థాన్‌ను కట్టడి చేశాం. తర్వాత బ్యాటింగ్‌లో శుభారంభం దక్కింది. ఇక జేసన్ రాయ్ ఎంత బాగా ఆడాడో చెప్పాల్సిన పనిలేదు. తాను చేయాల్సిన పని చేశాడు. ఏ జట్టుమీదైనా ఇలాగే ఆడతాడు. ఈ టోర్నీలో ఇంకొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. మా జట్టులోని లోపాలను సరిదిద్దుకొని ఇకపై బాగా ఆడాలి. ఇప్పుడున్న స్థితి నుంచి ముందుకు సాగాలి’ అని విలియమ్సన్ అన్నాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.