Virat Kohli : ఆ జాబితాలో ధోనీని అధిగమించిన కోహ్లీ.. ఇక సచిన్‌ రికార్డుపై కన్ను

టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ(Virat Kohli).. ఓ అరుదైన రికార్డు విషయంలో ధోనీని అధిగమించాడు.

Updated : 17 Jul 2023 15:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ :  టీమ్‌ఇండియా తన వెస్టిండీస్‌ సిరీస్‌(WI vs IND)ను విజయంతో ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ 141 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించి.. తన WTC సైకిల్‌ను గొప్పగా ఆరంభించింది. ఈ క్రమంలో పరుగుల వీరుడు విరాట్‌ కోహ్లీ (Virat Kohli) ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ధోనీ(MS Dhoni)ని అధిగమించి.. సచిన్‌(Sachin Tendulkar)ను చేరుకునేందుకు సిద్ధమయ్యాడు.

కోహ్లీ ఇప్పటి వరకూ ఆడిన మ్యాచ్‌ల్లో.. టీమ్‌ఇండియా 296 సార్లు గెలుపొందింది. ఈ జాబితాలో మాజీ కెప్టెన్‌ ధోనీ(295)ని అధిగమించాడు. అయితే.. ఈ జాబితాలో దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌(307) అందరికంటే ముందున్నాడు. మరిన్ని విజయాలు తోడైతే.. కోహ్లీ అగ్రస్థానంలోకి వచ్చే అవకాశం ఉంది.

ధోనీ ముందుకు వచ్చే సరికి.. నా నోరు మూతపడుతుంది: చాహల్‌

ఈ జాబితాలో ఎవరు ఎక్కడ ఉన్నారంటే..

  • సచిన్‌ -307
  • విరాట్‌ కోహ్లీ - 296
  • ఎంఎస్‌ ధోనీ - 295
  • రోహిత్‌ శర్మ -277
  • యువరాజ్‌ సింగ్‌ -227
  • రాహుల్‌ ద్రవిడ్‌ -216

ఇక టీమ్‌ఇండియా టెస్టుల్లో నంబర్‌ వన్‌ స్థానంలో కొనసాగుతోంది. అయితే.. విండీస్‌పై 2-0తేడాతో గెలిచినప్పటికీ.. అగ్రస్థానంలో ఉంటుందని చెప్పలేం. ఎందుకంటే ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా.. యాషెస్‌ సిరీస్‌లో మరో రెండు టెస్టుల్లో గెలిస్తే.. తొలి స్థానానికి చేరుకునే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు