అశ్విన్‌ బెస్ట్‌.. అందుకే వాళ్లతో ఆడాలనుకుంటాడు

టీమ్‌ఇండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అత్యుత్తమ ఆటగాడని, అందుకే మేటి జట్లతో ఆడాలనుకుంటాడని హైదరాబాదీ సొగసరి బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అభిప్రాయపడ్డాడు...

Published : 03 Mar 2021 01:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అత్యుత్తమ ఆటగాడని, అందుకే మేటి జట్లతో ఆడాలనుకుంటాడని హైదరాబాదీ సొగసరి బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ క్రీడాఛానెల్‌లో ఆకాశ్‌ చోప్రాతో మాట్లాడిన సందర్భంగా వీవీఎస్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. యాష్‌ చాలా తెలివైన ఆటగాడని మెచ్చుకున్నాడు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఆటగాళ్లు కేవలం తమ నైపుణ్యాలనే కాకుండా.. ఆట కోసం సన్నద్ధమవ్వడం, ప్రణాళికలు రూపొందించడం, వాటిని పక్కాగా అమలు చేయడం కూడా ముఖ్యమని వీవీఎస్‌ చెప్పాడు. యాష్‌ వీటన్నింటిపైనా దృష్టి సారిస్తాడని, అందుకే అతడు అత్యుత్తమ ఆటగాడని మెచ్చుకున్నాడు.

‘అశ్విన్‌ బ్యాట్స్‌మెన్‌ బలహీనతలు తెలుసుకుంటాడు. వాటిపైన సాధన చేస్తాడు. అలాగే కచ్చితమైన ప్రణాళికలు అమలు పరుస్తాడు. అందువల్లే తనని తాను మరింత బాగా తీర్చిదిద్దుకుంటున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలోనూ అతడి నుంచి మెరుగైన ప్రదర్శన చూశాం. స్టీవ్‌స్మిత్‌ లాంటి గొప్ప బ్యాట్స్‌మన్‌ను ఎలా ఇబ్బంది పెట్టాడో గమనించాం. ఇలాంటివే అతడిని ఛాంపియన్‌గా మారుస్తాయి. ఈ విధంగానే అతడు అత్యుత్తమ ఆటగాడిగా ఉండాలనుకుంటాడు. అలాగే అలాంటి మేటి జట్లతోనే పోటీపడాలనుకుంటాడు’ అని లక్ష్మణ్‌ వివరించాడు. అనంతరం ఆకాశ్‌ చోప్రా మాట్లాడుతూ.. అశ్విన్‌ రాక్‌స్టార్‌ అని కొనియాడాడు. టీమ్ఇండియా తరఫున కుంబ్లే నంబర్‌ వన్‌ బౌలరైనా యాష్‌ కూడా బాగా వికెట్లు తీస్తున్నాడని, 77 టెస్టుల్లోనే 400 వికెట్లు పడగొట్టాడని ప్రశంసించాడు. కొంత కాలంగా అతడు బంతితో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని