Yuvi opinion on POTT WC 2023: విరాట్, రోహిత్ కాదు.. అతడే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ’: యువీ

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ (ODI World Cup 2023) జరుగుతోంది.

Updated : 19 Nov 2023 14:00 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతోంది. కప్‌ను ఎవరు సొంతం చేసుకుంటారనేది పక్కన పెడితే ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’(Player of the Tournament)గా ఎవరు నిలుస్తారనే దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. తాజాగా ఇదే అంశంపై భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్‌ సింగ్‌ (Yuvraj Singh) స్పందించాడు. అద్భుతమైన ఓపెనింగ్‌తో జట్టుకు శుభారంభం అందిస్తున్న రోహిత్‌ శర్మతోపాటు ఈ టోర్నీలో అత్యధిక పరుగులతో అగ్రస్థానంలో ఉన్న విరాట్ కోహ్లీని కాదని.. పేస్‌ సంచలనం వైపు యువీ మొగ్గు చూపాడు. అలాగే హార్దిక్‌పాండ్య లేనిలోటు ఎక్కడా కనిపించలేదని.. రిజర్వ్‌ బెంచ్‌ చాలా బలంగా ఉందన్నాడు.

‘‘భారత్‌కు రిజర్వ్‌ బెంచ్‌పైనా మ్యాచ్‌ విన్నర్లు ఉన్నారు. హార్దిక్ పాండ్య గాయపడటం వరమని నేను చెప్పను. అయితే, అవకాశం వచ్చిన తర్వాత షమీ ఎలాంటి ప్రదర్శన ఇస్తాడని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. షమీ(Mohammed Shami) మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేశాడు. గొప్ప ప్రదర్శనతో అదరగొట్టాడు. అందుకే, ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్ (POTT) అవార్డుకు అన్ని అర్హతలు కలిగిన వారిలో షమీ ముందుంటాడు. అతడికే వస్తుందని భావిస్తున్నా. 

కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు అద్భుతమైన అవకాశం వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్‌లో మెగా టోర్నీని గెలిస్తే చూడటానికి చాలా బాగుంటుంది. ఆసియా కప్ ముందు భారత వన్డే టీమ్‌తో ఇప్పటి జట్టును పోల్చి చూస్తే ఆశ్చర్యమేస్తోంది. అప్పుడు సరైన కాంబినేషన్‌ కోసం ఇబ్బంది పడ్డారు. గాయాల నుంచి కోలుకుని వచ్చిన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, బుమ్రా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు’’ అని యువరాజ్‌ సింగ్ (Yuvraj Singh) వ్యాఖ్యానించాడు.

ODI WC Final 2023: భారత్‌ vs ఆస్ట్రేలియా ఫైనల్‌ మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌

భారత్‌ గెలిస్తే భోజనం ఉచితం: దాబా యజమాని

వన్డే ప్రపంచకప్‌(ODI World Cup 2023)ను టీమ్‌ఇండియా గెలిస్తే తన దాబాలో భోజనం ఉచితంగా ఇస్తానని అహ్మదాబాద్‌కు చెందిన నరేంద్ర సింగ్ తెలిపారు. భారత్ తొలిసారి కప్‌ను గెలిచిన 1983 నుంచి ప్రతి మెగా టోర్నీని చూస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘కపిల్‌ దేవ్‌ నాయకత్వంలో భారత్ 1983లో విశ్వవిజేతగా నిలిచింది. అప్పటి నుంచి ప్రతి వరల్డ్‌ కప్‌ను చూస్తున్నా. ఇప్పుడు మళ్లీ టీమ్‌ఇండియా (Team India) ఫైనల్‌కు చేరింది. ఈసారి కప్‌ గెలిస్తే భోజనం ఉచితంగా పెడతా’’ అని నరేంద్ర వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని