అదిరే ఫీచర్లతో రెడ్‌మీ నోట్‌ 10ఎస్‌, స్మార్ట్‌వాచ్‌

అందుబాటు ధరల్లో చక్కని ఫీచర్ల ఫోన్లతో వినియోగదారులను ఆకట్టుకునే షామీ తాజాగా రెడ్‌మీ నోట్‌10ఎస్‌ను భారత్‌లో విడుదల చేసింది.

Updated : 19 May 2021 07:20 IST

అందుబాటు ధరల్లో చక్కని ఫీచర్ల ఫోన్లతో వినియోగదారులను ఆకట్టుకునే షామీ తాజాగా రెడ్‌మీ నోట్‌10ఎస్‌ను భారత్‌లో విడుదల చేసింది. అలాగే రెడ్‌మీ స్మార్ట్‌ వాచ్‌ను కూడా అందుబాటులోకి తేనుంది. మీడియా టెక్‌ హీలియో జీ95 ఎస్‌వోసీ ప్రాసెసర్‌తో నోట్‌10 ఎస్‌ పనిచేస్తుంది. కాగా 11 స్పోర్ట్స్‌ మోడ్స్‌ ఉన్న స్మార్ట్‌ వాచ్‌ బరువు కేవలం 35 గ్రాములే.
ఫోన్‌ ప్రత్యేకతలు: 6.43 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ ఆమ్‌లెడ్‌ డిస్‌ప్లే, డ్యుయల్‌ నానో సిమ్‌, 5,000 ఏఎంహెచ్‌ బ్యాటరీ, 33 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌. ఆండ్రాయిడ్‌ 11, ఎంఐయూఐ 12.5 ఆన్‌ టాప్‌. 13 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా, వెనుకవైపు 64 ఎంపీ మెగాపిక్సల్‌ మెయిన్‌, 8 ఎంపీ అల్ట్రావైడ్‌, 2 ఎంపీ మ్యాక్రో, 2 ఎంపీ డెప్త్‌ (నాలుగు) కెమెరాలు.
ధర: 6జీబీ+64 జీబీ స్టోరేజ్‌: రూ15,999, 6జీబీ+128 జీబీ: 15,999.

వాచ్‌ ప్రత్యేకతలు: 1.4 అంగుళాల టీఎఫ్‌టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 2.5డీ కర్వ్‌డ్‌ గ్లాస్‌ ఆన్‌ టాప్‌. సింగిల్‌ బటన్‌, జీపీఎస్‌, గ్లోనాస్‌, బ్లూటూత్‌ వీ5.1 సదుపాయాలు. పీపీజీ హార్ట్‌ రేట్‌, జియో మ్యాగ్నటిక్‌ వంటి సెన్సర్లు, ట్రయల్‌ రన్నింగ్‌, హైకింగ్‌, వాకింగ్‌, ఇండోర్‌ సైక్లింగ్‌, స్విమ్మింగ్‌ ఇలా పదకొండు స్పోర్ట్‌ మోడ్స్‌. రోజుమొత్తం గుండె వేగాన్ని కనిపెట్టుకొని ఉండటం, నిద్ర తీరుతెన్నులను నమోదు చేయటానికీ సదుపాయాలున్నాయి. ఒకసారి ఫుల్‌ ఛార్జ్‌ (రెండు గంటలు) చేస్తే 10 రోజులు పనిచేస్తుందని షామీ చెబుతోంది. మే 25 నుంచి ఆన్‌లైన్‌ మార్కెట్లో అందుబాటులో ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు