ఫొటో టు పీడీఎఫ్‌

ఫోన్‌లో జేపీజీ, పీఎన్‌జీ వంటి వివిధ రకాల ఫొటోలుంటాయి. అన్ని ప్రధాన ఆన్‌లైన్‌ వేదికలు వీటిని సపోర్టు చేస్తాయి. అయితే డాక్యుమెంటేషన్‌, క్లాస్‌వర్క్‌ వంటి అవసరాల కోసం ఫొటోలను పీడీఎఫ్‌లుగా సేవ్‌ చేయాల్సి రావొచ్చు.

Updated : 15 Nov 2022 17:21 IST

ఫోన్‌లో జేపీజీ, పీఎన్‌జీ వంటి వివిధ రకాల ఫొటోలుంటాయి. అన్ని ప్రధాన ఆన్‌లైన్‌ వేదికలు వీటిని సపోర్టు చేస్తాయి. అయితే డాక్యుమెంటేషన్‌, క్లాస్‌వర్క్‌ వంటి అవసరాల కోసం ఫొటోలను పీడీఎఫ్‌లుగా సేవ్‌ చేయాల్సి రావొచ్చు. ఐఫోన్‌, ఐప్యాడ్‌లో దీన్ని తేలికగానే చేసుకోవచ్చు.
* ఐఫోన్‌లో ఆల్బమ్స్‌లోకి వెళ్లి, సెలెక్ట్‌ బటన్‌ను తాకాలి. పీడీఎఫ్‌గా మార్చు కోవాలనుకునే ఫొటోను ఎంచుకోవాలి. కావాలంటే ఒకేసారి ఎక్కువ ఫొటోలనూ ఎంచుకోవచ్చు. తర్వాత షేర్‌ బటన్‌ మీద నొక్కి షేర్‌ షీట్‌ నుంచి ప్రింట్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఫొటో ప్రివ్యూను రెండు వేళ్లతో అదిమి, అవతలి వైపునకు లాగితే ఫొటో పీడీఎఫ్‌గా సేవ్‌ అవుతుంది.
*షేర్‌ షీట్‌లో బుక్స్‌ ద్వారానూ ఫొటోను పీడీఎఫ్‌గా మార్చుకోవచ్చు. ఫొటోను ఎంచుకొని, షేర్‌ బటన్‌ను తాకాలి. షేర్‌ షీట్‌ మీద బుక్స్‌ మీద నొక్కాలి. అప్పుడు ఫొటో దానంతటదే పీడీఎఫ్‌ ఫైలుగా మారి, బుక్స్‌లో ఓపెన్‌ అవుతుంది. అక్కడ్నుంచి సేవ్‌ చేసుకుంటే సరి.
* ఫైల్స్‌ యాప్‌ కూడా త్వరగా పీడీఎఫ్‌లను సృష్టించుకోవటానికి వీలు కల్పిస్తుంది. దీనిలో అప్పటికే ఫొటోలు ఉన్నట్టయితే వాటిని ఎంచుకొని, కాసేపు అలాగే అదిమి పట్టాలి. తర్వాత క్రియేట్‌ పీడీఎఫ్‌ను ఎంచుకోవాలి. ఒకవేళ ఫైల్స్‌ యాప్‌లో ఫొటోలు లేనట్టయితే వాటిని దీనిలోకి కాపీ చేసి తర్వాత పీడీఎఫ్‌గా మార్చుకోవచ్చు. ఫొటోస్‌ ఫోల్డర్‌లో ఉన్న ఫొటోలను ఎంచుకొని షేర్‌ బటన్‌ను ట్యాప్‌ చేయాలి. తర్వాత సేవ్‌ టు ఫైల్స్‌ను ఎంచుకుంటే ఫైల్స్‌ యాప్‌లో ఫొటోలు సేవ్‌ అవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని