పీసీకి వైరస్ సోకిందా?
పీసీ వాడేవారికి వైరస్లు కొత్తకాదు. ఎప్పుడో అప్పుడు వీటితో సతమతమవటం తెలియంది కాదు. ఇంతకీ కంప్యూటర్ వైరస్ అంటే ఏంటి?
పీసీ వాడేవారికి వైరస్లు కొత్తకాదు. ఎప్పుడో అప్పుడు వీటితో సతమతమవటం తెలియంది కాదు. ఇంతకీ కంప్యూటర్ వైరస్ అంటే ఏంటి? ఒక పోగ్రామ్. మన ప్రమేయం లేకుండానే పీసీలో ఇన్స్టాల్ అయ్యి హానికర పనులు చేస్తుంది. మొత్తం పనితీరునే మార్చేస్తుంది. మరి కంప్యూటర్‌కు వైరస్ సోకిందని తెలుసుకోవటమెలా? దీన్ని గుర్తించటానికి ఏవైనా లక్షణాలు ఉంటాయా?
కంప్యూటర్ వైరస్ల బెడద ఈనాటిది కాదు. 50 ఏళ్ల కిందటే మొదలైంది. మొట్టమొదటి కంప్యూటర్ వైరస్ పేరు క్రీపర్ వామ్. ఇది 1971లో పుట్టుకొచ్చింది. ఇదేమీ హాని చేయలేదు గానీ బాగా చిరాకు పెట్టింది. అర్పానెట్ అంతటా ప్రయాణిస్తూ ‘పట్టుకోండి’ అనే సందేశం వదిలి పెట్టేది. అలా మొదలైన కంప్యూటర్ వైరస్ ప్రస్థానం అనంతంగా సాగుతూనే వస్తోంది. ఇవి రోజురోజుకీ ప్రమాదకరంగా మారుతూనే వస్తున్నాయి. తీవ్ర నష్టం కలిగిస్తూనే ఉన్నాయి. మనం ఇన్స్టాల్ చేసుకోకపోయినా పీసీలో చొరబడేదే అయినా ఇందులో మన ప్రమేయం అసలే లేదనుకోవటానికి లేదు. ఈ-మెయిల్ లింకును నొక్కినప్పుడో, వైరస్‌లతో కూడిన వెబ్సైట్లను చూసినప్పుడో అదును చూసుకొని దాడి చేసేస్తుంది. ప్రస్తుతం రాన్సమ్వేర్ రకం వైరస్లు పెను ప్రమాదంగా పరిణమిస్తున్నాయి. డబ్బులు చెల్లిస్తే గానీ పీసీని తెరవనీయని స్థితికి తీసుకొస్తున్నాయి. వీటి దెబ్బకు ప్రభుత్వ సంస్థలు, ప్రఖ్యాత వ్యాపార సంస్థలు, బ్యాంకులు సైతం చేతులెత్తేస్తున్నాయి. అడిగినంత డబ్బు చెల్లించి తమ పీసీలను స్వాధీనం చేసుకుంటున్నాయి. ఈ సంవత్సరం ప్రతి 14 సెకండ్లకు ఒక వ్యాపారసంస్థ వీటి బారినపడుతున్నట్టు, ఫలితంగా కోట్లాది రూపాయలు ముట్టజెబుతున్నట్టు సైబర్ సెక్యూరిటీ సంస్థల సర్వేలు పేర్కొంటున్నాయి. వీటికి వ్యక్తులూ మినహాయింపేమీ కాదు. ఇలాంటి రాన్సమ్వేర్ దాడి జరిగినట్టు గుర్తిస్తే వెంటనే నిపుణుల సలహా తీసుకోవటం తప్పనిసరి. మరి కంప్యూటర్‌కు వైరస్ సోకిందని గుర్తించేదెలా? దీన్ని గుర్తించటానికి కొన్ని ‘లక్షణాలు’ లేకపోలేదు.
మాటిమాటికీ క్రాష్ అవటం
వైరస్ సోకినప్పుడు కంప్యూటర్ విచిత్రంగా ప్రవర్తించటం ఆరంభిస్తుంది. మాటిమాటికీ ఆఫ్ కావొచ్చు. దానంతటదే రీస్టార్ట్ కావొచ్చు. కొన్నిసార్లు హార్డ్ డిస్క్‌లో స్పేస్ పూర్తిగా నిండుకోవచ్చు. లేదంటే డేటా గానీ ప్రోగ్రామ్‌లు గానీ అదృశ్యమైపోవచ్చు. ఇవన్నీ వైరస్ సోకిందనటానికి ఆనవాళ్లే.
అదే పనిగా పాపప్‌లు
ఏదైనా వెబ్సైట్ చూస్తున్నప్పుడు మామూలుగా కన్నా పెద్ద మొత్తంలో పాపప్‌లు దర్శనమిస్తుంటే వైరస్ సోకిందేమోనని అనుమానించాలి. బ్రౌజర్లో, వెబ్సైట్లలో యాడ్స్ ఎక్కువగా కనిపిస్తున్నా ఏదో సమస్య ఉన్నట్టే. యాడ్వేర్ ద్వారా ఇలాంటి వైరస్లు వ్యాపిస్తుంటాయి.
ఫైల్స్ యాక్సెస్ కాకపోవటం
వర్డ్‌ప్యాడ్‌ను తెరుస్తాం. ఏదో టైప్ చేయాలని చూస్తాం. కానీ టైప్ చేయటానికి అనుమతి లేదనే సందేశం ప్రత్యక్షమైతే? ఇది పీసీకి వైరస్ సోకిందటానికి స్పష్టమైన సంకేతం. హానికరమైన ప్రోగ్రామ్‌లు ఇన్స్టాల్ అయినప్పుడు మన పీసీలోని ఫైళ్లు యాక్సెస్ కావు. అనుమతి లేదని నిరాకరిస్తాయి.
వేగం నెమ్మదించటం
మామూలుగా కన్నా పీసీ వేగం నెమ్మదించినా అనుమానించాల్సిందే. వైరస్ సోకినప్పుడు కంప్యూటర్ చాలా నెమ్మదిగా పనిచేస్తుంటుంది. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్‌లో కంప్యూటర్ బగ్స్ నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. దీంతో పీసీ మీద ఎక్కువ భారం పడుతుంది. చాలా పనులు చేయాల్సి వస్తుంది. దీంతో వేగం గణనీయంగా పడిపోతుంది.
అనుమానిత వైబ్సైట్లలోకి మళ్లింపు
బ్రౌజర్ ఓపెన్ చేసి అడ్రస్ బార్లో గూగుల్.కామ్ అని టైప్ చేశారు. కానీ ఎలక్ట్రానిక్ వస్తువులను తక్కువ ధరకు అమ్మే వెబ్సైట్ ఓపెన్ అయ్యిందనుకోండి. ముందు మనకే నమ్మబుద్ధి కాదు. అడ్రస్బార్లో తప్పుగా టైప్ చేశామేమోనని మనల్ని మనమే అనుమానిస్తుంటాం. నిజానికి ఇలా ఒక సైటుకు బదులు ఇంకో సైట్ ఓపెన్ కావటమనేది వైరస్ సోకిందటానికి ఒక సంకేతం. కంప్యూటర్లోకి బగ్ చొరబడినప్పుడు అవి ఆయా ప్రకటనలు, యూఆర్ఎల్ వైపు తీసుకెళ్తాయి.
డేటా వాడకం పెరగటం
దాడులు చేయటానికి లేదా డేటాను సంగ్రహించటానికి హ్యాకర్లు ఆన్లైన్లో భారీ నెట్‌వర్క్‌లను వాడుకుంటూ ఉంటారు. దీంతో డేటా ఎక్కువగా ఖర్చవుతుంటుంది. కాబట్టి హఠాత్తుగా ఇంటర్నెట్ వాడకం పెరిగినట్టు గమనిస్తే వైరస్ సోకిందని అనుమానించాలి.
ఎక్కువ శబ్దం చేయటం
కంప్యూటర్ను వాడకపోయినా కూడా హార్డ్‌వేర్ నిరంతరం శబ్దం చేస్తోందా? మామూలు కన్నా ఎక్కువ శబ్దం వస్తోందా? అతిగా, వేగంగా పనిచేస్తున్నట్టు అనిపిస్తోందా? అయితే వైరస్ బారినపడి ఉండొచ్చు. విండోస్ అప్డేట్ అయినప్పుడో, ఏదైనా ఉచితమైన ప్రాసెస్ జరుగుతున్నప్పుడో పీసీ లేదా ల్యాప్‌టాప్ తెర తిరిగి వెలుగుతుంటుంది. ఇలాంటివేవీ లేకుండానే ఉన్నట్టుండి వెలిగితే వైరస్ సోకిందటానికి సంకేతం కావొచ్చు.
మన నుంచే సందేశాలు
ఈమెయిల్, సోషల్ మీడియా ఖాతాలు.. ఇతర ఆన్లైన్ సేవల్లో సమస్యలు మొదలైనా వైరస్ సోకి ఉండొచ్చు. కొన్నిసార్లు వీటి నుంచి చిత్రమైన సందేశాలు రావొచ్చు. మన ఖాతాల నుంచి మనకే సందేశాలు అందొచ్చు. దీనికి కారణం వైరస్ నేరుగా ఈమెయిల్, సోషల్ మీడియా ఖాతాల్లోకి చొరబడటం. కీలాగర్ సాయంతో హ్యాకర్లు పాస్‌వర్డ్‌లను అపహరించటమూ దీనికి కారణం కావొచ్చు.
తప్పించుకునేదెలా?
* వైరస్లు చాలావరకు ఫిషింగ్ ద్వారా వ్యాపిస్తుంటాయి. లాటరీ తగిలిందనో, ఫ్రీ రీచార్జ్ చేస్తామనో హ్యాకర్లు ఈమెయిళ్లు, సోషల్ మీడియా ఖాతాలకు లింకులను, అటాచ్మెంట్లను పంపించి ఆకర్షిస్తుంటారు. వీటిని నొక్కితే వైరస్ పీసీలో చొరబడుతుంది. ఇలాంటి లింకుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తెలిసినవారి నుంచి ఇలాంటి లింకులు వచ్చినా వెంటనే నొక్కకుండా చూసుకోవాలి. ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి.
* చాలావరకు హానికరమైన .ఈఎక్స్ఈ ప్రోగ్రామ్స్, సాఫ్ట్వేర్స్ అంతర్జాలం నుంచి వాటంతటవే డౌన్లోడ్ అవుతుంటాయి. కాబట్టి విశ్వసనీయమైన ప్రోగ్రామ్స్, సాఫ్ట్‌వేర్స్‌ను మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి.
* బలమైన ఫైర్‌వాల్, అప్ టు డేట్ యాంటీవైరస్ ప్రోగ్రామ్‌లు తప్పనిసరి. యూఆర్ఎల్ బార్లో వెబ్సైట్ పేరుకు ముందు హెచ్‌టీటీపీఎస్ (గ్రీన్ లాక్) ఉందో లేదో కూడా చూసుకోవాలి. గ్రీన్ లాక్ లేనట్టయితే వైరస్ లేదా మాల్వేర్ సోకే ప్రమాదముంది.
* కంప్యూటర్ వాడని సమయాల్లో.. నిద్ర పోతున్నప్పుడో, బయటకి వెళ్లినప్పుడో పీసీని స్కాన్ చేసేలా యాంటీవైరస్ పోగ్రామ్‌లను సెట్ చేసుకోవాలి. దీంతో పనికి ఆటంకం కలగకుండానే పీసీని సురక్షితంగా ఉంచుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మెదడులాంటి కంప్యూటర్!
మనిషి మెదడులా పనిచేసే, ఒకే సమయంలో వేర్వేరుగా స్పందించే కంప్యూటర్లను రూపొందించాలని చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ దిశగా ఇంటెల్ శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద న్యూరోమార్ఫిక్ కంప్యూటర్ను రూపొందించారు. -
దైవకణం కథ
అది అన్ని కణాలకూ ద్రవ్యరాశిని సంతరింపజేస్తుంది. దీని గురించి 1960ల్లోనే తెలిసినా 50 ఏళ్ల తర్వాత గానీ ఉనికి బయటపడలేదు. ప్రపంచంలోనే అతి పెద్ద, అతి సంక్లిష్ట యంత్రం సాయం తీసుకుంటే తప్ప అది సాధ్యం కాలేదు. -
కాల మహిమ
ఉగాది రోజు పంచాంగం విన్నారా? దీనిలోని తిథులు, రోజులు, పక్షాలు, నెలలు, రుతువులు.. అన్నీ కాల గమన సంకేతాలే. అసలు కాలమంటే ఏంటి? అది ఎలా మొదలైంది? ఇలాగే కొనసాగుతుందా? అంతమవుతుందా? -
కంప్యూటర్‌కు బుర్ర!
మన మెదడు అద్భుతమైంది. హేతుబద్ధంగా వ్యవహరిస్తుంది. కార్య కారణాలను విశ్లేషించి ఒక నిర్ణయానికి వస్తుంది. ఉచితానుచితాలను బేరీజు వేస్తుంది. ఏ పని ఎలా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో పసిగడుతుంది. -
ఫోన్ ట్యాప్ అయ్యిందా?
నేటి డిజిటల్ యుగంలో వ్యక్తిగత సమాచార గోప్యత, భద్రత అతి కీలకమయ్యాయి. అధునాతన నిఘా పద్ధతుల నేపథ్యంలో ఇవి మరింత ప్రాధాన్యం సంతరించు కుంటున్నాయి. నిత్య జీవితంలో విడదీయలేని పరికరంగా మారిన ఫోన్ల మీదా నిఘా వేయటం, ట్యాపింగ్ చేయటమూ చూస్తున్నాం. -
రోబో సేవలు చేసేనే..
మనిషికి మనిషి తోడంటారు. ఇప్పుడు మర మనిషీ (రోబో) చేయందిస్తోంది. ఒకపక్క అధునాతన హ్యూమనాయిడ్ రోబోల వెల్లువ సంచలనం సృష్టిస్తుండగా.. మరోపక్క మామూలు రోబోలూ సేవలకు సిద్ధమవుతున్నాయి. -
మానవ రోబో దండు!
రోబో అనగానే ఏం గుర్తుకొస్తుంది? లోహ చట్రంతో కదిలే మర యంత్రమో, కదిలే లోహం బొమ్మో మదిలో కదలాడుతుంది. రబ్బరు కండరాలతో చేసినదైతే మనిషి మాదిరిగానూ కనిపిస్తుంది. చూపు, మాట మనిషిని పోలి ఉంటాయి. -
paul alexander: ఇనుప ఊపిరితిత్తి!
ఓ పొడవైన పెట్టె. శరీరమంతా అందులోనే. తల మాత్రమే బయటకు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 72 ఏళ్లు అందులోనే గడిపితే? అమెరికాకు చెందిన పాల్ అలెగ్జాండర్ అలాగే గడిపారు -
గూగుల్ సెర్చ్ తెలివిగా..
స్మార్ట్ఫోన్లలో గూగుల్ సెర్చ్‌ను వాడనివారుండరంటే అతిశయోక్తి కాదు. కానీ తేలికగా, త్వరగా ఆయా అంశాలను శోధించటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయనే సంగతి తెలుసా? అలాంటి కొన్ని ఉపాయాల గురించి తెలుసుకుందాం. -
భళారే డిజిటల్ విచిత్రం!
ఒకప్పటి కన్నా స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల సామర్థ్యం, వేగం పుంజుకున్న మాట నిజం. కానీ ఆకారంలో పెద్దగా మారింది లేదు. ఒకసారి అంచులు చిన్నగా.. మరోసారి కెమెరా బంప్‌లు పెద్దగా ఉండటం తప్పించి దాదాపు అలాగే కనిపిస్తుంటాయి. -
కృత్రిమ మేధ గుండె కాయ
కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎక్కడ చూసినా ఈ పేరే మార్మోగుతోంది. -
ఇక ఏఐ సినిమా!
పదాల కూర్పు ఆధారంగా చిటికెలో ఫొటోలు, చిత్రాలు, సంగీతం, పాటలను పుట్టిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) మరో అడుగు ముందుకేసింది. ఏకంగా వీడియోలనూ సృష్టించే స్థాయికి చేరుకుంది. విప్లవాత్మక ఛాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్ఏఐ సంస్థ కొత్తగా తీసుకొచ్చిన జనరేటివ్ కృత్రిమ మేధ (జెన్ఏఐ) మోడలే దీనికి నిదర్శనం. -
ఈ విశ్వ కిరణాలు..
విశ్వ కిరణాలు.. కాస్మిక్ రేస్. అంతరిక్షం ఆవలి నుంచి దూసుకొచ్చే ఇవి నిరంతరం అతి వేగంగా.. దాదాపు కాంతి వేగంతో సమానంగా విశ్వమంతటా ప్రయాణిస్తుంటాయి. వీటి మీద మొదటి నుంచీ శాస్త్రవేత్తలకు ఎంతో ఆసక్తి. ఎందుకంటే అంతరిక్షంలో పుట్టుకొచ్చిన చోటు, ఢీకొట్టిన వస్తువులను బట్టి ఇవి విశ్వానికి సంబంధించిన ఎన్నో విషయాలను వివరిస్తాయి. -
ప్రేమ శాస్త్రం!
ప్రేమ ఎందుకు పుడుతుందో, ఎవరి మీద పుడుతుందో తెలియదు. ఒకరికి నచ్చిన వ్యక్తి మరొకరికి నచ్చకపోవచ్చు. ఒకరికి అసలే నచ్చనివారు మరొకరికి ప్రాణం కన్నా మిన్నగా అనిపించ్చొచ్చు. -
ఫోల్డర్ మాయలు
విండోస్ పీసీలో రోజూ ఫోల్డర్లను వాడుతూనే ఉంటాం. కొత్త ఫైళ్లను స్టోర్ చేయటం, డేటాను వరుసగా పెట్టుకోవటం.. ఇలా ఎన్నింటికో వీటిని ఉపయో గిస్తుంటాం. మరి అదృశ్య ఫోల్డర్‌ను సృష్టించుకోగలరా? ఒకేసారి బోలెడన్ని ఫోల్డర్ల పేర్లను మార్చుకోగలరా? ఖాళీ ఫోల్డర్లను గుర్తించగలరా? ఇలాంటి కొన్ని చిత్రమైన ఫోల్డర్ చిట్కాల గురించి తెలుసుకుందాం. -
అమెజాన్ అడుగున బంగారు నేల
అమెజాన్ అనగానే దట్టమైన అడవులే గుర్తుకొస్తాయి. మనుషులు దూరటానికి వీల్లేని అక్కడ ఒకప్పుడు పెద్ద పట్టణమే ఉండేదని ఇటీవల తేలటం అందరినీ ఆశ్చర్యపరచింది -
ఏఐ టెక్కులు!
అసలే కృత్రిమ మేధ (ఏఐ) యుగం. ఆపై ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్ వస్తు ప్రదర్శన. ఇక చెప్పేదేముంది? ఏ పరికరాన్ని చూసినా ఏఐమయమే. హెల్త్ ట్రాకర్ల దగ్గరి నుంచి వాహనాల వరకూ అన్నింటికీ అదే ఆలంబన. -
Cyber Crime: నయా సైడర్!
నేటి సైబర్ యుగంలో నేరాలూ మారిపోతున్నాయి. ఆన్లైన్ మోసాలు కోకొల్లలు. డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు చోరీ చేసి మన ప్రమేయమేమీ లేకుండానే నేరగాళ్లు షాపింగ్ చేయటం తెలిసిందే -
కొత్త టెక్ లోకం
డిజిటల్ పరిణామం ఆగేది కాదు. ఇదో నిరంతర ప్రక్రియ. గత ఏడాదిని గతి తిప్పిన ట్రెండ్స్ కొత్త సంవత్సరాన్నీ పరుగులు తీయించనున్నాయి. మెషిన్ ఇంటెలిజెన్స్ జోరందుకోనుంది. వాస్తవ, కాల్పనిక ప్రపంచాల మధ్య హద్దులు చెరగటం ఖాయంగా కనిపిస్తోంటే.. నిరంతర అంతర్జాల పరిణామ ప్రక్రియ మన జీవితాలను గణనీయంగా శాసించేలా రూపుదిద్దుకుంటోంది. -
ఇస్రో ఏఐ వత్సరం 2024
ఇది మనదేశం జాబిల్లిని తాకి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచిన సంవత్సరం.ఇది కృత్రిమ మేధ ప్రయోగశాలలను దాటుకొని నిత్య జీవన వ్యవహారాల్లోకి విరివిగా చొచ్చుకొచ్చిన సంవత్సరం.శాస్త్ర, సాంకేతిక రంగాలు ఒకదాంతో మరోటి పోటీ పడుతూ కొత్త వత్సరంలోకి అడుగిడుతున్న వేళ సాధించిన ఘనతలను సమీక్షించుకోవటం ముదావహం. -
స్థానిక మేధ
కృత్రిమ మేధ (ఏఐ) తీరు మారుతోంది. ఆంగ్లం గడపను దాటుకొని స్థానిక భాషలపై దృష్టి సారిస్తోంది. ఆయా భాషల వైవిధ్యం, యాసలు, సంస్కృతులకు అనుగుణంగా రూపాంతరం చెందుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
మహీంద్రా నుంచి ఎక్స్‌యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!
-
‘బాయ్‌ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
-
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ