కందిరీగకు లతా మంగేష్కర్‌ పేరు‌

టిగనోలిడే కుటుంబానికి చెందిన రెండు కొత్త కందిరీగ జాతులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీటిల్లో ఒకదానికి ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ పేరు పెట్టటం విశేషం. తమిళనాడులోని సెన్‌బహనూర్‌లో గుర్తించిన దీన్ని ఇప్పుడు ‘టాయినియోగొనలస్‌ లతే’

Published : 21 Sep 2022 01:16 IST

టిగనోలిడే కుటుంబానికి చెందిన రెండు కొత్త కందిరీగ జాతులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీటిల్లో ఒకదానికి ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ పేరు పెట్టటం విశేషం. తమిళనాడులోని సెన్‌బహనూర్‌లో గుర్తించిన దీన్ని ఇప్పుడు ‘టాయినియోగొనలస్‌ లతే’ అని పిలుచుకుంటున్నారు. తమిళనాడులోని అంబసముద్రంలో బయటపడిన మరో కందిరీగ జాతికి ప్రముఖ భారతీయ కీటక శాస్త్రవేత్త టీవీ రామకృష్ణ అయ్యర్‌ గౌరవార్థం ‘టాయినియోగొనలస్‌ అయ్యర్‌’గా నామకరణం చేశారు. ఈ కందిరీగల జీవనచట్రం ప్రత్యేకమైంది. తల్లి కందిరీగ ఆకుల మీద గుడ్లు పెడుతుంది. ఈ ఆకులను కందిరీగలు, సీతాకోక చిలుకలు తిన్నప్పుడు గుడ్లు వాటి కడుపులోకి చేరుకుంటాయి. అక్కడే పొదుగుతాయి. తర్వాత కందిరీగల, సీతాకోక చిలుకల శరీరాలను చీల్చుకుంటూ గుడ్ల లోంచి లార్వా బయటకు వస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని