Google photos: గూగుల్‌ ఫొటోస్‌తో హైలైట్‌ వీడియో

గూగుల్‌ ఫొటోస్‌ ప్రియులకు శుభవార్త. దీనికి కొత్తగా హైలైట్‌ వీడియోలను సృష్టించుకోవటానికి తోడ్పడే ఫీచర్‌ను జోడించనున్నట్టు గూగుల్‌ ప్రకటించింది.

Updated : 13 Nov 2023 09:51 IST

గూగుల్‌ ఫొటోస్‌ ప్రియులకు శుభవార్త. దీనికి కొత్తగా హైలైట్‌ వీడియోలను సృష్టించుకోవటానికి తోడ్పడే ఫీచర్‌ను జోడించనున్నట్టు గూగుల్‌ ప్రకటించింది. ఇది మనకు ఇష్టమైన ప్రాంతాలు, వేడుకలు, పనులకు సంబంధించిన వీడియోలను సృష్టించి ముందుంచుతుంది. అదీ చాలా తేలికగా. గూగుల్‌ ఫొటోస్‌ యాప్‌ ఓపెన్‌ చేసి, గ్యాలరీలో పైన ఉండే ప్లస్‌ గుర్తును క్లిక్‌ చేయాలి. తర్వాత జాబితాలోంచి ‘హైలైట్‌ వీడియో’ ఆప్షన్‌ను ఎంచుకొని, ఏం కావాలో సెర్చ్‌ చేస్తే చాలు. ఉదాహరణకు- హైదరాబాద్‌, 2023 అని ఎంచుకున్నారనుకోండి. గూగుల్‌ ఫొటోస్‌ యాప్‌ తనకు తానే గ్యాలరీలోంచి మంచి క్లిప్స్‌, ఫొటోలను ఎంచుకొని వీడియోగా మలుస్తుంది. దానికి తగిన సంగీతాన్నీ జోడిస్తుంది. గుర్తుండిపోయే దృశ్యాలను, సందర్భాలను వీడియోగా మార్చుకోవాలనుకునేవారికిది బాగా ఉపయోగపడుతుంది. వీటిని ఆత్మీయులతో షేర్‌ చేసుకుంటే ఆ మజానే వేరు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని