భలే శోధన

గూగుల్‌ సెర్చ్‌తో ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. దీనిలో తెలియని టూల్స్‌ బోలెడన్ని. వాటిల్లో కొన్ని ఇవీ.

Published : 01 Nov 2023 00:23 IST

గూగుల్‌ సెర్చ్‌తో ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. దీనిలో తెలియని టూల్స్‌ బోలెడన్ని. వాటిల్లో కొన్ని ఇవీ. దేని నిర్వచనమైనా తెలుసుకోవాలంటే పదానికి ముందు డిఫైన్‌ అని టైప్‌ చేస్తే చాలు. ఉదాహరణకు- విద్యుత్తు నిర్వచనం కోసం సెర్చ్‌ బార్‌లో define electricity అని టైప్‌ చేస్తే డిక్షనరీ దాని నిర్వచనాన్ని ముందుంచుతుంది. అలాగే ఉచ్చారణ కోసం పదం తర్వాత pronunciation అని టైప్‌ చేయొచ్చు. ఎలా ఉచ్చరించాలో అక్షరాల్లో కనిపిస్తుంది. స్పీకర్‌ గుర్తు మీద క్లిక్‌ చేస్తే పలికే తీరూ తెలుస్తుంది. ఏదో పెద్ద సంఖ్య. దాన్ని అక్షరాల్లో ఎలా రాయాలో తెలియటం లేదు. ఎలా అని చింతిస్తు న్నారా? సంఖ్య తర్వాత ఈక్వల్‌ గుర్తు, ఇంగ్లిష్‌ అని టైప్‌ చేస్తే సరి. ఉదాహరణకు- 953,116,070= english అని టైప్‌ చేస్తే nine hundred fifty-three million one hundred sixteen thousand and seventy అని చెప్పేస్తుంది. పని చేసీ చేసీ విసుగు వస్తోందా? ఆన్‌లైన్‌లో పాత ఆటలతో ఉపశమనం పొందొచ్చు. ఉదాహరణకు- సెర్చ్‌ బార్‌లో Google snake అని టైప్‌ చేసి చూడండి. పాత కాలం నాటి ఫోన్‌ గేమ్‌ ప్రత్యక్ష మవుతుంది. ఇష్టమున్నంత సేపు ఆడుకో వచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని