Instagram: ఇన్‌స్టాలో ఫేస్‌బుక్‌ వద్దనుకుంటున్నారా..?

ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నుంచి ఫేస్‌బుక్‌ను డీలింక్‌ చేయాలనుకుంటున్నారు. అయితే, ముందుగా సెట్టింగ్స్‌లో..

Published : 25 Feb 2022 23:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండేవారికి ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల అనుసంధానం గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా ఖాతాలను లింక్‌ చేసుకొనే రెండు ప్లాట్‌ఫామ్‌లోని స్నేహితులను ఒకేచోట సులభంగా కనెక్ట్‌ అవుతుంటారు. పోస్టులు, స్టోరీలను ఒకేసారి రెండింట్లో షేర్‌ చేస్తుంటారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లను వేర్వేరుగా వాడాలనుకునే వారు లేకపోలేదు. ఇందులో మీరు కూడా ఉన్నట్లయితే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నుంచి ఫేస్‌బుక్‌ను ఇలా డీలింక్‌ చేసుకోవచ్చు.

డీలింక్‌ చేసేయండిలా..

* తొలుత ఇన్‌స్టాగ్రామ్‌ ఓపెన్‌ చేసి దిగువన కుడి వైపు ఉన్న ప్రొఫైల్ పై క్లిక్‌ చేయండి. 

ఆపై ఎగువన కుడివైపు ఉన్న ఆప్షన్‌లో ‘సెట్టింగ్స్‌ (Settings)’లోకి వెళ్లండి.

సెట్టింగ్స్‌లో కింద ‘అకౌంట్‌ సెంటర్‌ (Account Center)’పై క్లిక్‌ చేయండి. 

తర్వాత మీ పేరుపై క్లిక్‌ చేసి కనెక్ట్‌ చేసిన ఖాతాలను ఓసారి సరిచూసుకోండి. 

ఈ మేరకు మీరు తొలగించాలనుకుంటున్న దానిపై క్లిక్‌ చేసి అన్‌లింక్‌ (Remove account Center) చేసేయండి. అంతే మీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నుంచి ఫేస్‌బుక్‌ డీలింక్‌ అవుతుంది.  ఇలాగే మీరు లింక్‌ చేయాలనుకుంటున్న అకౌంట్ల జత చేసుకోవచ్చు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని