MWC 2022: టెక్‌ పండగ వచ్చింది.. కొత్త కొత్త ఫోన్లు తెచ్చింది!

కొత్త కొత్త మొబైళ్లు, గ్యాడ్జెట్ల, సాంకేతికతను ఏటా ప్రపంచానికి పరిచయం చేసే మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ (MWC) ప్రారంభమయ్యింది.

Updated : 11 May 2022 18:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొత్త కొత్త మొబైళ్లు, గ్యాడ్జెట్లు, సాంకేతికతను ఏటా ప్రపంచానికి పరిచయం చేసే మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ (MWC) ప్రారంభమయ్యింది. భారత కాలమానం ప్రకారం సోమవారం (ఫిబ్రవరి 28) మొదలయ్యింది. ఈ టెక్‌ పండగ మార్చి 3 వరకు స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరుగుతుంది. మొదటి రోజు పోకో, రియల్‌ మీ, టీసీఎల్‌, జెడ్‌టీఈ, హానర్‌ మొదలగు కంపెనీలు తమ ఫోన్లను పరిచయం చేశాయి. ఇప్పటివరకు అక్కడ ఆవిష్కరించిన స్మార్ట్‌ఫోన్లు, వాటి ఫీచర్ల వివరాలు మీ కోసం..


పోకో ఎక్స్‌4 సిరీస్‌ (Poco X4 Series)

పోకో ఎక్స్‌ సిరీస్‌లోనూ రెండు మోడల్స్‌ను మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌లో పరిచయం చేశారు. వీటిలో ఒకటి 5జీ ఫోన్ పోకో ఎక్స్‌4 ప్రో. 120 హెర్జ్‌ 6.67 అంగుళాల సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో తీసుకొస్తున్నారు. స్నాప్‌డ్రాగన్‌ 695 5జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 67 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వెనకవైపు 108ఎంపీ, 8ఎంపీ, 2ఎంపీ కెమెరాలు ఉన్నాయి. ముందువైపు 16ఎంపీ సెల్ఫీ కెమెరాను ఇస్తున్నారు. పోకో సిరీస్‌లో మరో కొత్త మోడల్‌నూ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. పోకో ఎం4 ప్రో (Poco M4 pro 4G) పేరుతో తీసుకొస్తున్న ఈ 4జీ ఫోన్‌లో 6.43 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 33 వాట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వెనకవైపు 64ఎంపీ, ముందువైపు 16ఎంపీ కెమెరాలు ఉన్నాయి.


హానర్‌లో మరో రెండు..

హానర్‌ మ్యాజిక్‌ సిరీస్‌లో మరో రెండు మోడళ్లను పరిచయం చేశారు. హానర్‌ మ్యాజిక్‌ 4, మ్యాజిక్‌ 4 ప్రో పేరుతో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రెండింటిలోని స్పెసిఫికేషన్స్‌ దాదాపు ఒకేలా ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 1 5జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 120 హెర్జ్ రిఫ్రెష్‌ రేటుతో 6.81 అంగుళాల డిస్‌ ప్లే ఇస్తున్నారు. వెనకవైపు 50 ఎంపీ వైడ్‌, 50 ఎంపీ అల్ట్రా, 64 ఎంపీ పెరిస్కోప్‌ కెమెరాలు ఉన్నాయి. ముందు వైపు 12ఎంపీ లెన్స్‌తో 3డీ డెప్త్‌ సెన్సార్‌ను ఇస్తున్నారు. బ్యాటరీ సామర్థ్యంలో రెండింటిలో కాస్త తేడా ఉంది. హానర్‌ మ్యాజిక్‌ 4లో బ్యాటరీ సామర్థ్యం 4800 ఎంఏహెచ్‌ ఉండగా.. హానర్‌ మ్యాజిక్‌ 4ప్రోలో 4600 ఎంఏహెచ్‌ ఉంది.


నోకియా సీ సిరీస్‌లో కొత్తగా మూడు..

హెచ్‌ఎమ్‌డీ గ్లోబల్‌ కంపెనీ నోకియా సీ సిరీస్‌లో మరో మూడు ఫోన్లను తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. నోకియా సీ2 సెకండ్‌ ఎడిషన్‌, నోకియా సీ21, సీ21 ప్లస్‌ పేరుతో విడుదల చేయనున్నట్లు తెలిపారు.


రియల్‌మీ జీటీ సిరీస్‌ మరో రెండు మోడళ్లు..

రియల్‌ మీ జీటీ సిరీస్‌లో మరో రెండు మోడల్స్‌ గురించి మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌లో పరిచయం చేశారు. రియల్‌మీ జీటీ 2, రియల్‌మీ జీటీ 2 ప్రో పేరుతో వీటిని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.62 అంగుళాలతో రియల్‌ మీ జీటీ, 6.7 అంగుళాలతో రియల్‌ మీ జీటీ 2 ప్రో తీసుకొస్తున్నారు. ఈ రెండు మోడళ్లలోని స్పెసిఫికేషన్స్‌ దాదాపు సేమ్‌గానే ఉన్నాయి. రెండింటిలో స్నాప్‌డ్రాగన్‌ 888 5జీ ప్రాసెసర్‌ ఇస్తున్నారు. వెనుకవైపు 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు అదనంగా రెండు కెమెరాలు ఇస్తున్నారు. ముందువైపు 16 ఎంపీ కెమెరా ఉంటుంది.


టీసీఎల్‌లో రెండు మోడళ్లు..

టీసీఎల్‌ 30ఈ, టీసీఎల్‌ 30 ఎస్‌ఈ సిరీస్‌ ఫోన్లను మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌లో పరిచయం చేశారు. ఆక్టా కోర్‌ మీడియా టెక్‌ హిలీయో జీ25 ప్రాసెసర్‌తో 6.25 అంగుళాల డిస్‌ప్లేతో ఈ రెండు ఫోన్లను ఆవిష్కరించారు. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వెనకవైపు 50ఎంపీ+2ఎంపీ+2ఎంపీ కెమెరాలు ఉన్నాయి. ముందు వైపు 5ఎంపీ కెమెరా ఉంది.


10 నిమిషాల ఛార్జింగ్‌ 100 నిమిషాల మ్యూజిక్‌..

యూజర్ల కోసం ప్రత్యేకంగా రియల్‌ మీ 42డీబీ నాయిస్‌ కాన్సలేషన్‌తో ఎయిర్‌ బడ్స్‌ 3ను రూపొందించింది. 546 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యంతో రియల్‌మీ ఎయిర్‌ బడ్స్‌ 3ను అక్కడ విడుదల చేశారు. ఇది ఒక గంటలోనే ఫుల్‌ ఛార్జ్‌ అయ్యి 30 గంటలపాటు పనిచేస్తుంది. ఈ ఎయిర్‌బడ్స్‌తో 10 నిమిషాల ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో 100 నిమిషాల పాటు మ్యూజిక్‌ వినొచ్చు.


రియల్‌మీ బుక్‌ ప్రైమ్‌ ల్యాప్‌టాప్‌

గతేడాది రియల్‌ మీ బుక్‌ స్లిమ్‌ ల్యాప్‌టాప్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. దీన్ని కొత్తగా అప్‌గ్రేడ్‌ చేస్తూ రియల్‌మీ బుక్‌ ప్రైమ్‌ ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చింది. దీనిలో 11 జెనరేషన్‌ ఇంటెల్‌కోర్‌ ఐ5 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. అడ్వాన్స్‌డ్ వెపర్‌ ఛాంబర్‌ లిక్విడ్‌ కూలింగ్‌ సిస్టమ్‌తో దీన్ని రూపొందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని