40 వేలకు పెరిగిన క్రియాశీల కేసులు

రాష్ట్రంలో ప్రస్తుతం 40,414 క్రియాశీల కరోనా కేసులున్నాయి. ఈ నెల 1న 3,733 క్రియాశీల కేసులుండగా 28 రోజుల్లోనే అవి 40వేలు దాటాయి.

Published : 29 Jan 2022 04:05 IST

కొత్తగా 3,877 కరోనా పాజిటివ్‌లు

మరో ఇద్దరి మృతి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రస్తుతం 40,414 క్రియాశీల కరోనా కేసులున్నాయి. ఈ నెల 1న 3,733 క్రియాశీల కేసులుండగా 28 రోజుల్లోనే అవి 40వేలు దాటాయి. తెలంగాణలో కొత్తగా 3,877 కొవిడ్‌ కేసులు నమోదు కాగా మొత్తం బాధితుల సంఖ్య 7,54,976కు పెరిగింది. మహమ్మారి కోరల్లో చిక్కి మరో ఇద్దరు మృతిచెందడంతో ఇప్పటి వరకూ 4,083 మంది కన్నుమూశారు. వైరస్‌ బారిన పడి చికిత్స పొందిన అనంతరం తాజాగా 2,981 మంది కోలుకోగా మొత్తంగా 7,10,479 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఈ నెల 28న సాయంత్రం 5.30 గంటల వరకూ నమోదైన కొవిడ్‌ సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు శుక్రవారం విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1,01,812 నమూనాలను పరీక్షించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 3,18,77,830కి పెరిగింది. మరో 4,006 నమూనాల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో కేసుల సంఖ్య కొద్దిగా తగ్గుముఖం పట్టింది. గత వారం రోజుల కేసుల నమోదును పరిశీలిస్తే 22న 1,643 పాజిటివ్‌లు నిర్ధారణ కాగా తాజాగా 1,189కి తగ్గాయి. మేడ్చల్‌ మల్కాజిగిరిలో 348, రంగారెడ్డిలో 241, హనుమకొండలో 140, నల్గొండలో 133, యాదాద్రి భువనగిరిలో 119, భద్రాద్రి కొత్తగూడెంలో 116, ఖమ్మంలో 112, పెద్దపల్లిలో 110, నిజామాబాద్‌లో 107, మంచిర్యాల జిల్లాలో 104 కేసులు నమోదయ్యాయి. మిగిలిన జిల్లాల్లో 100 కంటే తక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరో 2,58,853 కొవిడ్‌ టీకా డోసులను పంపిణీ చేశారు.

ఏపీలో 12561 కేసులు నమోదు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో గురువారం ఉదయం 9 నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల మధ్య 40,635 నమూనాలు పరీక్షించగా వీటిలో 12,561 మందికి వైరస్‌ సోకినట్లు గుర్తించారు. పాజిటివిటీ రేట్‌ 30.9%గా నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని