ఉత్తమ పర్యావరణ వీడియోలకు ఆహ్వానం: పీసీబీ

పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన వీడియోలను పంపాలని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) కోరింది.

Published : 10 May 2024 03:54 IST

ఈనాడు, హైదరాబాద్‌: పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన వీడియోలను పంపాలని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) కోరింది. వీటిలో ఉత్తమ వీడియోలను పీసీబీ యూట్యూబ్‌ ఛానల్‌లో ప్రసారం చేస్తామని తెలిపింది. ప్రసారమైన ఒక్కో వీడియోకు రూ.7,500 రివార్డు ఇస్తామని వెల్లడించింది. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించినట్లు వివరించింది. వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమలు.. కాలుష్య నియంత్రణలో, వ్యర్థాల నిర్వహణలో తాము అనుసరిస్తున్న ఉత్తమ పర్యావరణ పద్ధతులను షార్ట్‌ వీడియో ఫిల్మ్‌లుగా పంపించాలని ఆహ్వానించింది. పూర్తి వివరాలకు 9177303127 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని పీసీబీ సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని