పెండింగ్‌ బిల్లులను మంజూరు చేయాలి: యూఎస్‌పీసీ

విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికే పాఠశాలల్లో విద్యావాలంటీర్లను, పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని, ఉచిత విద్యుత్తు అమలు చేయాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్‌పీసీ) స్టీరింగ్‌ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

Published : 10 May 2024 03:58 IST

ఈనాడు, హైదరాబాద్‌: విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికే పాఠశాలల్లో విద్యావాలంటీర్లను, పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని, ఉచిత విద్యుత్తు అమలు చేయాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్‌పీసీ) స్టీరింగ్‌ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆర్థికశాఖ ఈ కుబేర్‌లో పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే మంజూరు చేయాలని, నాలుగు డీఏలను విడుదల చేయాలని అభ్యర్థించింది. యూఎస్‌పీసీ రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ సమావేశం గురువారం టీఎస్‌యూటీఫ్‌ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. ఎస్టీఎఫ్‌టీఎస్‌ నేత యు.పోచయ్య దీనికి అధ్యక్షత వహించగా, సభ్యులు కె.జంగయ్య, చావ రవి(టీఎస్‌యూటీ¨ఎఫ్‌), నాగిరెడ్డి(టీపీటీఎఫ్‌), లింగారెడ్డి(డీటీఎఫ్‌), రాజన్న(ఎస్సీఎస్టీఎఫ్‌), వెంకట్రావు(ఎస్సీఎస్టీ టీఏ), హరికిషన్‌, శ్రీనునాయక్‌(డీటీఏ), కొండయ్య(ఎంఎస్టీఎఫ్‌), విజయకుమార్‌(ఎస్సీఎస్టీయూఎస్‌)లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పలు డిమాండ్లు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని