వాతావరణ సూచనలు ఐదు దిక్కుల్లో..
ఇన్నాళ్లూ ఉత్తర తెలంగాణకు వర్ష సూచన అంటే.. ఆదిలాబాద్ నుంచి కరీంనగర్ వరకు వానలు పడొచ్చని భావించేవారు.
ఇప్పటి వరకు ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణ మాత్రమే
కొత్తగా తూర్పు, పశ్చిమ క్లస్టర్లు
స్పష్టమైన వాతావరణ సూచనలకు అవకాశం
ఈనాడు, హైదరాబాద్
ఇన్నాళ్లూ ఉత్తర తెలంగాణకు వర్ష సూచన అంటే.. ఆదిలాబాద్ నుంచి కరీంనగర్ వరకు వానలు పడొచ్చని భావించేవారు. అలాగే దక్షిణ తెలంగాణ అంటే.. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ తదితర జిల్లాలు, మధ్య తెలంగాణ అంటే.. మెదక్, వరంగల్, ఖమ్మం తదితర జిల్లాలుగా పరిగణించేవారు. నేల స్వభావం, వాతావరణ మార్పుల(ఆగ్రో క్లయిమేటిక్) ఆధారంగా ఈ మూడు క్లస్టర్లు ఏర్పాటు చేశారు. అయితే, వాతావరణ సూచనలు మరింత స్పష్టంగా, నిర్దుష్టంగా అందించేందుకు భారత వాతావరణశాఖ(ఐఎండీ) కొత్తగా మరో రెండు విభజనలు చేసింది. ఐఎండీ దేశవ్యాప్తంగా కొత్త క్లస్టర్ల(వాతావరణం పరంగా) ఏర్పాటుకు నిర్ణయించిన నేపథ్యంలో తెలంగాణలోనూ ఈ ప్రక్రియను చేపట్టారు.
వాతావరణ పరిస్థితులను అనుసరించి
రాష్ట్రంలో ఖమ్మం నుంచి మొదలు ఆదిలాబాద్ వరకు దాదాపు ఒకే తరహా పరిస్థితులు ఉంటాయి. అయితే, నిశితంగా పరిశీలిస్తే ఏపీలోని తూర్పుగోదావరి మాదిరి పరిస్థితులు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో కనిపిస్తూ వస్తున్నాయి. రుతుపవనాల గమనం, వర్షాలు పడుతున్న తీరును అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు మరింత దగ్గరగా జిల్లాల వాతావరణాన్ని అంచనా వేసేందుకు కొత్త క్లస్టర్లకు బీజం వేశారు. ఇందులో భాగంగా పది జిల్లాలతో తూర్పు తెలంగాణ క్లస్టర్‌ను రూపొందించగా... గతంలో దక్షిణ తెలంగాణగా పరిగణించిన ఉమ్మడి నల్గొండను తాజాగా ఇందులోకి చేర్చారు. పశ్చిమ తెలంగాణ పరిధిలోకి నాలుగు జిల్లాలు చేర్చారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని కామారెడ్డి ఇందులోకి వచ్చింది. అలాగే ఉత్తర తెలంగాణ పరిధిలో తొమ్మిది జిల్లాలు, దక్షిణంలో ఐదు, మధ్య(సెంట్రల్) తెలంగాణలో ఐదు జిల్లాలను తీసుకొచ్చారు. ఆగ్రో క్లయిమేటిక్ పరిస్థితులను అనుసరించి ఈ క్లస్టర్లను ఏర్పాటు చేశారని, వీటితో స్పష్టతతో కూడిన సూచనలు ప్రజలకు అందించవచ్చని వాతావరణశాఖ శాస్త్రవేత్త శ్రావణి తెలిపారు.
కొత్త క్లస్టర్ల పరిధిలోకి వచ్చే జిల్లాలు..
తూర్పు: జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ
పశ్చిమం: వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి
ఉత్తరం: ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి
దక్షిణం: మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల
మధ్య తెలంగాణ: సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్ఆర్ఆర్ నిర్మాణంతో పట్టణ రాష్ట్రంగా తెలంగాణ
పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అనుకూలమైన వాతావరణం, మంచి నీటి వసతి, నిరంతర విద్యుత్తు సరఫరా, శాంతిభద్రతలు, స్నేహపూర్వక ప్రభుత్వం కారణంగా హైదరాబాద్ ప్రపంచస్థాయి నగరంగా ఎదుగుతోందని చెప్పారు. -
‘నైరుతి’ ప్రయాణం మొదలైంది..
భారతదేశ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాడి అయిన నైరుతి రుతుపవనాలు ఆదివారం దేశంలోని నికోబార్ దీవులపైకి ప్రవేశించాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. -
నేడు తెలంగాణ మంత్రి మండలి సమావేశం
రాష్ట్ర మంత్రి మండలి సమావేశం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగనుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. -
తిన్నోళ్లకు తిన్నంత అనారోగ్యం
పురుగులు పట్టిన, కాలం చెల్లిన ఆహార పదార్థాలు... కల్తీ మసాలాలు.. మళ్లీ మళ్లీ కాచి వాడుతున్న నూనెలు.. అపరిశుభ్రమైన వంటశాలలు.. రాష్ట్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, మండీలు, ఐస్‌క్రీం పార్లర్లు, కాఫీ షాప్‌లలో పరిస్థితి ఇది. -
ఆశతో పెట్టుబడి.. మోసాలకు పట్టుబడి
రూ.వెయ్యి పెడితే రూ.10 వేలు, రూ.లక్ష పెడితే రూ.10 లక్షల లాభం చూపిస్తామంటే ఎవరికైనా ఒకసారి ప్రయత్నిద్దామని ఆశ పుడుతుంది. -
మన వ్యాధుల భారంలో 56%.. తిండి వల్లే
మన జీవనశైలి, ఆహారపు అలవాట్లలో గణనీయ మార్పులు వస్తున్నాయి. ఇవి ఆరోగ్యంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. -
దేశానికి తెలుగు ‘వెలుగు’లు
మీ ఇంట్లో కరెంటు వెలుగు రావాలన్నా, మీరు వినియోగించే అనేక ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు నడవాలన్నా కావాల్సిన కీలక ఇంధనం బొగ్గు. -
మత్తు అనర్థాలపై అవగాహన: ఐఎంఏ
మత్తుపదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే అనర్థాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్.. తెలంగాణ రాష్ట్ర మానసిక ఆరోగ్య కమిటీ ప్రకటించింది. -
తగ్గిన గనులశాఖ ఆదాయం
రాష్ట్రంలో గనుల శాఖకు 2023-24లో రూ.5,439.93 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో సగానికిపైగా బొగ్గు ద్వారానే వచ్చింది. కాగా ఇసుక ఆదాయ లక్ష్యసాధనలో గనులశాఖ వెనుకబడింది. -
తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి
రాష్ట్రంలో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంక్షేమ సమితి అధ్యక్షుడు, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
రెండు, మూడు నెలల్లో… బీబీనగర్-గుంటూరు డబ్లింగ్ పనులు
తెలుగు రాష్ట్రాల మధ్య కీలకమైన బీబీనగర్-గుంటూరు రెండో లైన్ పనులు రెండు, మూడు నెలల్లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. -
జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాలు విడుదల
బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆదివారం విడుదల చేసింది. -
థింపూలో ఏబీటీవో కార్యాలయం ప్రారంభం
భూటాన్ రాజధాని థింపూలో అసోసియేషన్ ఆఫ్ బుద్ధిస్ట్ టూర్ ఆపరేటర్ల (ఏబీటీవో) కార్యాలయం ఆదివారం ప్రారంభమైంది. -
29, 30 తేదీల్లో వనదేవతల గద్దెలకు తాళాలు
మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ నెల 29, 30 తేదీల్లో మూసివేస్తున్నట్లు పూజారులు ప్రకటించారు. -
నేటి నుంచే ‘టెట్’
రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సోమవారం ప్రారంభం కానుంది. జూన్ 2వరకు జరిగే ఈ పరీక్ష మొదటి పేపర్‌కు 99,958 మంది, రెండో పేపర్‌కు 1,86,428 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. -
నేటి నుంచి యాదాద్రీశుడి జయంతి ఉత్సవాలు
యాదాద్రి క్షేత్రంలో ఈ నెల 20 నుంచి 22 వరకు నారసింహుడి వార్షిక జయంతి మహోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
‘మత్తు’ నియంత్రణకు కదిలిన యంత్రాంగం
రాష్ట్రంలో నాటుసారాను మూడు నెలల్లో నిర్మూలించడంతోపాటు గంజాయిని నియంత్రించాలనే లక్ష్యంలో భాగంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాచరణ ప్రారంభించింది. -
వాతావరణ మార్పులతో ‘ఆర్థిక విధ్వంసం’
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోందని, ఊహించిన దానికన్నా ఆరు రెట్లు ఎక్కువగా విధ్వంసం ఉందని ఓ అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. -
ప్రమాదంలో భావప్రకటన స్వేచ్ఛ
దేశంలో భావప్రకటన స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు ప్రమాదంలో పడ్డాయని ఒడిశా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డా.ఎస్.మురళీధర్ అన్నారు. -
ముంచుకొచ్చిన వానలు.. మొలకెత్తిన వడ్లు
ములుగు జిల్లా వెంకటాపూర్‌లోని కొనుగోలు కేంద్రంలో సన్న ధాన్యం ఆరబోయగా మొత్తం ఇలా మొలకెత్తాయి. జిల్లా రైతాంగాన్ని పది రోజులుగా అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. -
ఆధార్ అనుసంధానం కాకున్నా..‘డెత్ క్లెయిమ్’లు పరిష్కరించండి
ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాకు ఆధార్ నంబర్ అనుసంధానం కాకుండా చనిపోయిన చందాదారుల క్లెయిమ్‌లు పరిష్కరించేందుకు ఈపీఎఫ్‌వో వెసులుబాటు కల్పించింది.
తాజా వార్తలు (Latest News)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్‌రావు విమర్శ
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల
-
ప్రశాంతమైన పల్నాడుని వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల