ఓటేస్తే కన్సల్టేషన్‌, వైద్య పరీక్షల్లో రాయితీ

ఓటు హక్కుపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ ఆసుపత్రులు ముందుకొచ్చాయి.

Published : 10 May 2024 03:59 IST

ఏఐజీ, మెడికవర్‌ ఆసుపత్రుల ప్రకటన

ఈనాడు, హైదరాబాద్‌: ఓటు హక్కుపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ ఆసుపత్రులు ముందుకొచ్చాయి. పోలింగ్‌ శాతం పెంచాలనే ఉద్దేశంతో గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ) ప్రత్యేక చొరవ తీసుకుంది. ఓటు వేసిన వారందరికీ ఉచిత కన్సల్టేషన్‌తోపాటు అన్ని రకాల లేబొరేటరీ పరీక్షలను 50 శాతం తక్కువకే అందించాలని సంకల్పించింది. ఈ సందర్భంగా ఏఐజీ ఛైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ చొరవ ఎంతో చిన్నదైనప్పటికీ పౌరులు ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుగ్గా పాల్గొనేలా చేస్తుందన్నారు. మే 13న ఓటు వినియోగించుకున్న వారు ఆసుపత్రికి వచ్చి ఉచిత కన్సల్టేషన్‌, పరీక్షల్లో 50 శాతం రాయితీ పొందాలని పిలుపునిచ్చారు.

మాదాపూర్‌లోని మెడికవర్‌ ఆసుపత్రి కూడా ఓటు హక్కుపై ప్రజలను చైతన్యం చేస్తోంది. ఓటు హక్కు వినియోగించుకున్న వారు తమ ఆసుపత్రుల్లో ఉచిత కన్సల్టేషన్‌తోపాటు అన్ని రకాల పరీక్షల్లో 30 శాతం వరకు రాయితీ పొందొచ్చని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని