‘బ్యారేజీ’ పేరుతో.. ‘డ్యాం’ నిర్మాణం జరుగుతున్నట్లు ముందే తెలుసా?

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లను జ్యుడిషియల్‌ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌ ప్రశ్నించినట్లు తెలిసింది.

Published : 10 May 2024 03:55 IST

ఈఎన్సీలను ప్రశ్నించిన జ్యుడిషియల్‌ కమిషన్‌!

ఈనాడు, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లను జ్యుడిషియల్‌ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌ ప్రశ్నించినట్లు తెలిసింది. బ్యారేజీ (నీటి మళ్లింపునకు దోహదపడే కట్టడం) పేరుతో డ్యాం (రిజర్వాయర్‌లో నీటి నిల్వకు వీలుగా చేపట్టే కట్టడం) నిర్మిస్తున్నట్లు మీకు ముందే తెలుసా అని అడిగినట్లు సమాచారం. ఈఎన్సీలు అనిల్‌కుమార్‌ (జనరల్‌), నాగేంద్రరావు (ఓ అండ్‌ ఎం)లతోపాటు కాళేశ్వరం సీఈ సుధాకర్‌రెడ్డిలతో గురువారం జస్టిస్‌ పీసీ ఘోష్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సాంకేతిక అంశాలపై ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. ‘మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం ఒరిజినల్‌ డిజైన్‌ ప్రకారమే చేపట్టారా? నిర్మాణంలో తేడాలు ఎందుకు వచ్చాయి? లోపాలు ఏర్పడటానికి కారణాలు ఏమై ఉంటాయి? బ్యారేజీ నిర్మాణం పేరుతో పనులు చేపట్టి డ్యాం ఎలా నిర్మించారు? ఈ మార్పులు మీకు ముందే తెలుసా?’ అని ప్రశ్నలు వేసినట్లు తెలిసింది. దీంతోపాటు మూడు బ్యారేజీలకు సంబంధించిన వివరాలతో ఒక పత్రాన్ని సమర్పించాలని ఆదేశించినట్లు సమాచారం. నిర్మాణాల్లో లోపాలపై గుత్తేదారులకు లీగల్‌ నోటీసులు ఎందుకు ఇవ్వలేదని కూడా అడిగినట్లు సమాచారం. కాళేశ్వరం ఎత్తిపోతలపై రూపొందించిన ప్రజంటేషన్‌ను ఈఎన్సీ అనిల్‌కుమార్‌ ఈ సందర్భంగా కమిషన్‌కు సమర్పించినట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని