పాడి రైతులకు బిల్లులు చెల్లించాలి

రాష్ట్రంలోని ప్రభుత్వ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (విజయడెయిరీ)కి పాలను విక్రయిస్తున్న రైతులు గత 40 రోజులుగా బిల్లులు అందక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని పలు పాడి ఉత్పత్తిదారుల సంఘాల నేతలు సమాఖ్య ఎండీ చిట్టెం లక్ష్మిని కోరారు.

Published : 10 May 2024 03:53 IST

పాడిపరిశ్రమాభివృద్ధి సమాఖ్య ఎండీకి వినతి

ఈనాడు,హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (విజయడెయిరీ)కి పాలను విక్రయిస్తున్న రైతులు గత 40 రోజులుగా బిల్లులు అందక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని పలు పాడి ఉత్పత్తిదారుల సంఘాల నేతలు సమాఖ్య ఎండీ చిట్టెం లక్ష్మిని కోరారు. వరంగల్‌, జనగామ సంఘాల నేతలు ఇరుకు దేవేందర్‌రావు, సోమిరెడ్డి తదితరులు ఎండీని ఆమె కార్యాలయంలో గురువారం కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఏప్రిల్‌ నుంచి బిల్లులను చెల్లించకపోవడంతో కుటుంబ అవసరాలతో పాటు పశుగ్రాసం, రవాణా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. లీటర్‌కు రూ. 4 చొప్పున ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రోత్సాహకం నిలిచిపోయిందని వారు తెలిపారు. వెంటనే పాడి రైతుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని