ఎర్రని ఎండ.. కానరాని నీడ

‘శూన్య నీడ దినం’ సందర్భంగా హైదరాబాద్‌లో గురువారం మధ్యాహ్నం 12:12 గంటలకు నడినెత్తిన సూర్యుడున్నా కాసేపు ‘నీడ’ మాయమైంది. దీన్ని వీక్షించేందుకు బీఎం బిర్లా సైన్స్‌ సెంటర్‌లోని నక్షత్రశాల (ప్లానెటోరియం) ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

Updated : 10 May 2024 07:14 IST

‘శూన్య నీడ దినం’ సందర్భంగా హైదరాబాద్‌లో గురువారం మధ్యాహ్నం 12:12 గంటలకు నడినెత్తిన సూర్యుడున్నా కాసేపు ‘నీడ’ మాయమైంది. దీన్ని వీక్షించేందుకు బీఎం బిర్లా సైన్స్‌ సెంటర్‌లోని నక్షత్రశాల (ప్లానెటోరియం) ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీక్షించేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి వచ్చారు. ‘షాడో’ అని ఆంగ్ల అక్షరాలు రంధ్రాలతో రాసి ఉన్న రెండు పలకలపై నుంచి సూర్యకిరణాలు నిట్టనిలువుగా ప్రసరించి కింద మూడో పలకపై కనిపించింది.

సాధారణ రోజుల్లో నీడ పడడం వల్ల మూడో పలకపై ఇలా కనిపించదని నిర్వాహకులు తెలిపారు. సైన్స్‌ సెంటర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ రవిరాజా మాట్లాడుతూ ‘‘భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతాడని చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం. ప్రస్తుతం ఉత్తరాయణంలో ఉన్నాం. ఇక్కడ భూమి కొంత వంపుగా తిరుగుతుంది. దాని ఫలితంగా హైదరాబాద్‌లో మధ్యాహ్నం 12:12 గంటలకు మన నీడ మన పాదాల కింద కనిపించింది. నిటారుగా నిలబెట్టిన ఏ వస్తువు నీడ కూడా కొన్ని నిమిషాల పాటు పక్కకు వాలినట్లు కనిపించదు’’ అని తెలిపారు.

న్యూస్‌టుడే, నారాయణగూడ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని