లక్ష్మీ పంపుహౌస్‌ విద్యుత్తు బకాయిలు రూ.477.34 కోట్లు

కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంపుహౌస్‌ విద్యుత్తు బకాయి పెరుగుతూ వస్తోంది. 2019లో నాటి సీఎం కేసీఆర్‌ లక్ష్మీ పంపుహౌస్‌ను ప్రారంభించగా 2022 జులై వరకు గోదావరి జలాలను ఎత్తిపోశారు.

Published : 10 May 2024 03:49 IST

కాళేశ్వరం, న్యూస్‌టుడే: కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంపుహౌస్‌ విద్యుత్తు బకాయి పెరుగుతూ వస్తోంది. 2019లో నాటి సీఎం కేసీఆర్‌ లక్ష్మీ పంపుహౌస్‌ను ప్రారంభించగా 2022 జులై వరకు గోదావరి జలాలను ఎత్తిపోశారు. అప్పటికే కోట్ల రూపాయలు దాటిన విద్యుత్తు బిల్లు మరింత పెరుగుతూ వచ్చింది. 2024 ఏప్రిల్‌ నెలకు సంబంధించి రూ.6.02 కోట్ల బిల్లు రాగా.. దీంతో కలిపి 2019 నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు రూ.477.34 కోట్లను ట్రాన్స్‌కోకు చెల్లించాల్సి ఉంది. 2022 జులై 14న భారీ వరదల కారణంగా పంపుహౌస్‌లోకి వరదనీరు చేరి 17 బాహుబలి మోటార్లను ముంచెత్తింది. అప్పటి నుంచి జలాల ఎత్తిపోతలు లేకున్నా నూతన మోటార్లు అమర్చే ప్రక్రియ, మరమ్మతులు, పంపుహౌస్‌ నిర్వహణ, మోటార్ల పరీక్షలు జరుగుతుండటంతో విద్యుత్తు బిల్లు ఈ మేరకు నమోదైనట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని