ఆ పురుగుల మందుపై నిషేధం

టీస్పేన్స్‌ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన ట్రైకో డెర్మా విరిడి 1.50% లిక్విడ్‌ ఫార్ములేషన్‌ క్రిమిసంహారక మందును నిషేధించినట్లు వ్యవసాయ సంచాలకుడు బి.గోపి గురువారం తెలిపారు.

Published : 10 May 2024 03:50 IST

ఈనాడు, హైదరాబాద్‌: టీస్పేన్స్‌ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన ట్రైకో డెర్మా విరిడి 1.50% లిక్విడ్‌ ఫార్ములేషన్‌ క్రిమిసంహారక మందును నిషేధించినట్లు వ్యవసాయ సంచాలకుడు బి.గోపి గురువారం తెలిపారు. హైదరాబాద్‌లోని మలక్‌పేట ప్రయోగశాలలో జరిపిన పరీక్షల్లో ఇది నాసిరకం మందుగా తేలినట్లు చెప్పారు. ఈ మందును నిల్వ చేయొద్దని, విక్రయాలు జరపొద్దని ఆదేశించామని, రైతులెవరూ ఈ పురుగుల మందును కొనుగోలు చేయవద్దని ఆయన కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని