ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షలు ప్రారంభం

రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌, వ్యవసాయ, మెడికల్‌ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్‌టీయూహెచ్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న టీఎస్‌ఈఏపీసెట్‌-2024లో గురువారం మూడో రోజు ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి.

Published : 10 May 2024 03:52 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌, వ్యవసాయ, మెడికల్‌ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్‌టీయూహెచ్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న టీఎస్‌ఈఏపీసెట్‌-2024లో గురువారం మూడో రోజు ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రాలను విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్‌, జేఎన్‌టీయూహెచ్‌ వీసీ నరసింహారెడ్డి, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్‌, సెట్‌ కన్వీనర్‌ బీడీ కుమార్‌, కోకన్వీనర్‌ విజయ్‌కుమార్‌ తదితరులు సందర్శించారు. ఈనెల 7న సెట్‌ పరీక్షలు ప్రారంభం కాగా..తొలి రెండు రోజులు అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షలు జరిగాయి. ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షలు ఈనెల 11 వరకు జరగనున్నాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని