GATE: వయసు 64.. గేట్‌లో 140వ ర్యాంకు

ఉన్నత చదువులకు వయసు అడ్డుకాదు. ఉద్యోగం చేస్తూ కూడా చదివేవారు ఎందరో. కానీ, ఉద్యోగ విరమణ చేసిన తరువాత కూడా ఉన్నత చదువులు అభ్యసించేవారు అరుదు.

Updated : 19 Mar 2022 09:27 IST

అనంతపురం, న్యూస్‌టుడే: ఉన్నత చదువులకు వయసు అడ్డుకాదు. ఉద్యోగం చేస్తూ కూడా చదివేవారు ఎందరో. కానీ, ఉద్యోగ విరమణ చేసిన తరువాత కూడా ఉన్నత చదువులు అభ్యసించేవారు అరుదు. అనంతపురం నగరానికి చెందిన వి.సత్యనారాయణరెడ్డి ఇంజినీరుగా ఉద్యోగ విరమణ చేసిన తరువాత జేఎన్‌టీయూలో ఎంటెక్‌ చేశారు. గేట్‌ పరీక్షలో జాతీయస్థాయిలో 140వ ర్యాంకు సాధించి ఔరా అనిపించుకున్నారు. పంచాయతీరాజ్‌ శాఖలో ఇంజినీరుగా 39 ఏళ్లు పనిచేశారు. డీఈఈగా 2018లో ఉద్యోగ విరమణ చేశారు. 2019లో జేఎన్‌టీయూ సివిల్‌ విభాగంలో ఎంటెక్‌లో చేరి 2022లో పూర్తి చేశారు. 2022 గేట్‌ పరీక్షలోని జియోమోటిక్స్‌ ఇంజినీరింగ్‌ పేపరులో 140వ ర్యాంకు సాధించారు. ఆయన వయసు ప్రస్తుతం 64 సంవత్సరాలు. ఆయనకు ఇద్దరు కుమారులు. మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గేట్‌ సాధించిన అభ్యర్థులు ఉన్నత విద్యలో ప్రవేశానికి 3 సంవత్సరాలపాటు అవకాశం ఉంటుందని, కుటుంబసభ్యులతో చర్చించి బాంబే లేదా రౌర్కెలాలోని ఐఐటీలో జియోగ్రాఫికల్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (జీఐఎస్‌), రిమోట్‌ సెన్సింగ్‌ కోర్సులో చేరాలని భావిస్తున్నట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని