పుస్తక రచయితగా ఎస్పీఎఫ్‌ డీజీపీ

స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(ఎస్పీఎఫ్‌) డీజీపీ ఉమేష్‌ షరాఫ్‌ పుస్తక రచయితగా అవతారమెత్తారు. ఓ వైపు ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తూనే మరోవైపు ‘క్రిమినాలజీ అండ్‌ క్రైమ్‌ ప్రివెన్షన్‌’,

Published : 20 May 2022 05:36 IST

ఈనాడు, హైదరాబాద్‌: స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(ఎస్పీఎఫ్‌) డీజీపీ ఉమేష్‌ షరాఫ్‌ పుస్తక రచయితగా అవతారమెత్తారు. ఓ వైపు ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తూనే మరోవైపు ‘క్రిమినాలజీ అండ్‌ క్రైమ్‌ ప్రివెన్షన్‌’, ‘ఎకనామిక్‌ అఫెన్సెస్‌ ఇన్వెస్టిగేషన్‌’ పుస్తకాలను ఆయన రచించారు. నేరస్థుల స్వభావం, నేరాల నియంత్రణకు అవసరమైన చర్యలు, ఆర్థిక నేరాల దర్యాప్తు తదితర అంశాల గురించి వీటిలో వివరించారు. గురువారం ఈ పుస్తకాలను హైదరాబాద్‌ బీఆర్‌కే భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) సోమేశ్‌కుమార్‌కు అందజేశారు. నేరాల విచారణలో ఈ పుస్తకాలు పోలీసు అధికారులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని ఈ సందర్భంగా సోమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. పుస్తకాలు రచించిన ఉమేష్‌ షరాఫ్‌ను అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని