ఇక వాట్సప్‌లోనూ డిజిలాకర్‌ సేవలు

వాట్సప్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం డిజిలాకర్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సప్‌ నంబరు 9013151515 ద్వారా ప్రజలు పాన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌, సీబీఎస్‌ఈ 10వ తరగతి పాస్‌ సర్టిఫికెట్‌, 10, 12 తరగతుల

Updated : 24 May 2022 10:14 IST

ఈనాడు, దిల్లీ: వాట్సప్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం డిజిలాకర్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సప్‌ నంబరు 9013151515 ద్వారా ప్రజలు పాన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌, సీబీఎస్‌ఈ 10వ తరగతి పాస్‌ సర్టిఫికెట్‌, 10, 12 తరగతుల మార్క్‌షీట్లు, ద్విచక్రవాహనాల ఇన్సూరెన్స్‌ పాలసీ, ఇన్సూరెన్స్‌ పాలసీ డాక్యుమెంట్లు (లైఫ్‌, నాన్‌లైఫ్‌) పొందొచ్చని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీశాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజలు ఈ వాట్సప్‌ నంబరుకు నమస్తే/హాయ్‌/డిజిలాకర్‌.. ఈ పదాల్లో ఏదో ఒక దాన్ని టైప్‌చేసి పంపితే వెంటనే ఆధార్‌ నంబరు పంపమని అడుగుతుంది. అది టైప్‌ చేసిన తర్వాత వెరిఫికేషన్‌ కోడ్‌ ద్వారా వ్యక్తిగత ధ్రువీకరణ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కావాల్సిన డాక్యుమెంట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అయితే ప్రతి డాక్యుమెంట్‌ నంబరును టైప్‌చేసిన తర్వాతే అవి డౌన్‌లోడ్‌ అవుతాయి. ప్రజలకు అవసరమైన దస్తావేజులను సులభంగా పొందడానికి ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ డిజిలాకర్‌లో దేశవ్యాప్తంగా ఇప్పటికే 10 కోట్లమంది పేర్లు నమోదుచేసుకొని 5 కోట్లకుపైగా డాక్యుమెంట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని