కేంద్రం సహకరిస్తే బీసీల వర్గీకరణ సులువు

దేశవ్యాప్తంగా 2011లో చేపట్టిన సామాజిక, ఆర్థిక, కుల గణన వివరాలు బహిర్గతమైతేనే రాష్ట్రాలు బీసీల వర్గీకరణ, రిజర్వేషన్‌ కేటాయింపులు సులువుగా, పారదర్శకంగా చేపట్టగలవని తెలంగాణ బీసీ కమిషన్‌ అధ్యక్షుడు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అన్నారు.

Published : 26 May 2022 05:32 IST

తెలంగాణ బీసీ కమిషన్‌ వెల్లడి

ఈనాడు, బెంగళూరు: దేశవ్యాప్తంగా 2011లో చేపట్టిన సామాజిక, ఆర్థిక, కుల గణన వివరాలు బహిర్గతమైతేనే రాష్ట్రాలు బీసీల వర్గీకరణ, రిజర్వేషన్‌ కేటాయింపులు సులువుగా, పారదర్శకంగా చేపట్టగలవని తెలంగాణ బీసీ కమిషన్‌ అధ్యక్షుడు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ బృందం బుధవారం కర్ణాటక వెళ్లింది. ఆ రాష్ట్ర బీసీ కమిషన్‌ అధ్యక్షుడు జయప్రకాశ్‌ హెగ్డేతో బెంగళూరులో వకుళాభరణం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని రంగాల్లో బీసీల రిజర్వేషన్‌ పారదర్శకంగా చేపట్టేందుకు ఆయా రాష్ట్రాల కమిషన్లు ప్రయత్నిస్తున్నాయని వివరించారు. ఇందుకు కీలకమైన రెఫరెన్స్‌గా ఉండే 2011 జనగణన వివరాలను కేంద్రం కప్పిపుచ్చటం సరికాదని అభ్యంతరం తెలిపారు. ప్రజావాహినిలో ఉంచాల్సిన ఈ వివరాలు కనీసం బీసీ కమిషన్‌లకు కూడా అందుబాటులోకి తేలేదని అసహనం వ్యక్తం చేశారు. ఆగస్టు లేదా సెప్టెంబరులో దక్షిణ భారత బీసీ కమిషన్‌ సమ్మేళనాన్ని హైదరాబాద్‌లో నిర్వహిస్తామని కృష్ణమోహన్‌రావు తెలిపారు. దీనిద్వారా ప్రత్యేక తీర్మానాలను కేంద్రానికి సమర్పిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని