Published : 27 May 2022 05:02 IST

జీనోమ్‌వ్యాలీలో డీఎఫ్‌ఈ ఫార్మా ప్రతిభాకేంద్రం

ఔషధ సంస్థలకు సేవలు

ఈనాడు, హైదరాబాద్‌: జర్మనీకి చెందిన డీఎఫ్‌ఈ సంస్థ హైదరాబాద్‌లోని జీనోమ్‌వ్యాలీలో ప్రతిభా కేంద్రం (సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌) ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. గురువారం దావోస్‌లో మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఒప్పందంపై  సంస్థ సీఈవో మార్టి హెడ్‌మ్యాన్‌ తెలంగాణ పరిశ్రమల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌లు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ, ‘‘ప్రపంచ ప్రసిద్ధ డీఎఫ్‌ఈ ఫార్మాతో ఒప్పందం రాష్ట్ర ఔషధరంగానికి ఎంతో ఉపకరిస్తుంది. వారికి సాంకేతిక సమస్యలు దూరం చేసి జాతీయ, అంతర్జాతీయ అనుమతులు సత్వరమే అందించేందుకు కృషి చేస్తుంది’’ అని తెలిపారు. హెడ్‌మ్యాన్‌ మాట్లాడుతూ,  ప్రపంచవ్యాప్తంగా వంద దేశాల్లోని అయిదువేల సంస్థలకు తాము సేవలందిస్తున్నామని తెలిపారు. భారత్‌లోని ఔషధ సంస్థలకు అత్యుత్తమ సేవలందిస్తామని చెప్పారు.

నీతిఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌ భేటీ

నీతిఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌ గురువారం దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావుతో భేటీ అయ్యారు. తెలంగాణకు, తద్వారా దేశానికి పెట్టుబడుల సమీకరణకు కేటీఆర్‌ విశేష కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా ప్రశంసించారు. కేటీఆర్‌ అందరికీ ఆదర్శప్రాయుడని, ఆయన మాదిరిగా అన్ని రాష్ట్రాల మంత్రులు కృషి చేయాలన్నారు. కేటీఆర్‌ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అమితాబ్‌కాంత్‌తో భేటీ ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపారు.

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts