వైభవంగా వకుళమాత ఆలయ మహా సంప్రోక్షణ

తిరుపతి సమీపంలోని పాతకాల్వ వద్ద నిర్మించిన వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణ గురువారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్‌ పాల్గొన్నారు. ఆలయం వద్దకు చేరుకున్న సీఎంకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,

Published : 24 Jun 2022 05:36 IST

ఈనాడు, తిరుపతి: తిరుపతి సమీపంలోని పాతకాల్వ వద్ద నిర్మించిన వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణ గురువారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్‌ పాల్గొన్నారు. ఆలయం వద్దకు చేరుకున్న సీఎంకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తితిదే ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. అక్కడ తితిదే అధికారిక వృక్షం మానుసంపంగి మొక్క నాటారు. అక్కడి నుంచి ఆలయం వద్దకు చేరుకున్న సీఎంకు తితిదే వైఖానస ఆగమ సలహాదారు వేదాంతం విష్ణు భట్టాచార్య అర్చకులతో కలిసి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ మహాసంప్రోక్షణ శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. అక్కడి నుంచి ప్రదక్షిణగా ఆలయంలోకి చేరుకున్న సీఎం వకుళమాతను దర్శించుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రికి వేదపండితులు వేద ఆశీర్వాదం చేశారు. తితిదే ఈవో ధర్మారెడ్డి ముఖ్యమంత్రికి డ్రై ఫ్లవర్‌ సాంకేతికతతో తయారుచేసిన వకుళమాత ఫొటోఫ్రేమ్‌, తీర్థ ప్రసాదాలు అందించారు. తర్వాత ఆలయ నిర్మాణంలో భాగస్వాములైన పలువురిని సీఎం సత్కరించి బంగారు కడియాలు తొడిగారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని