న్యుమోనియా నిర్ధారణకు వైర్‌లెస్‌ డిటెక్టర్‌

చిన్నపిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు, న్యుమోనియాను నిర్ధారించేందుకు ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌లోని ఐసీ-వైబ్స్‌ పరిశోధనా ప్రయోగశాల వైర్‌లెస్‌ డిటెక్టర్‌ను ఆవిష్కరించింది.

Published : 07 May 2024 03:50 IST

ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌ పరిశోధక బృందం ఆవిష్కరణ

ఈనాడు, హైదరాబాద్‌: చిన్నపిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు, న్యుమోనియాను నిర్ధారించేందుకు ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌లోని ఐసీ-వైబ్స్‌ పరిశోధనా ప్రయోగశాల వైర్‌లెస్‌ డిటెక్టర్‌ను ఆవిష్కరించింది. ప్రయోగశాలలో సెమీ కండక్టర్లు, చిప్‌లు, సమీకృత సర్క్యూట్‌లను అభివృద్ధి చేస్తున్నామని ఐసీ-వైబ్స్‌ ప్రయోగశాల వ్యవస్థాపకులు ప్రొఫెసర్‌ అభిషేక్‌ శ్రీవాస్తవ సోమవారం తెలిపారు. కొన్నేళ్ల నుంచి పరిశోధనలు చేస్తున్నామని, చిప్‌ల రూపకల్పనకు ముందు సాఫ్ట్‌వేర్‌ సాయంతో ప్రయోగాలు నిర్వహిస్తున్నామని వివరించారు. సెమీ కండక్టర్లు, చిప్‌ల వినియోగం పెరుగుతున్న దృష్ట్యా రోగ నిర్ధారణకు వీటిని ఉపయోగించడంతో రోగులను స్పర్శించకుండానే వ్యాధి తీవ్రతను తెలుసుకునేందుకు వీలవుతుందన్నారు. గోల్డెన్‌ అవర్‌లో అత్యవసరమైన వైద్య సహాయాన్ని ప్రారంభించేందుకు అవసరమైన చిప్‌ పేటెంట్‌కు, అసాధారణ హృదయ స్పందన రేటు, శరీర ఉష్ణోగ్రత పడిపోవడాన్ని గుర్తించే పరికరాల పేటెంట్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని