పంట నష్టపరిహారం నిధుల విడుదల

రాష్ట్రంలో గత మార్చి 16 నుంచి 21 వరకు వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు రూ.15.81 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులిచ్చింది.

Published : 07 May 2024 03:49 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గత మార్చి 16 నుంచి 21 వరకు వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు రూ.15.81 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులిచ్చింది. ఎకరాకు రూ.10 వేల చొప్పున పది జిల్లాల్లో మొత్తం 15,814 ఎకరాల్లో పంట నష్టపోయిన 15,246 మంది రైతులకు సాయం విడుదల చేసింది. ఈ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని, 90 రోజుల్లోగా  అందరికీ సాయం అందాలని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని