అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతన బకాయిలు చెల్లించాలి

రెండు నెలలుగా వేతనాలు లేక ఇబ్బంది పడుతున్న అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం డిమాండ్‌ చేసింది.

Published : 07 May 2024 03:49 IST

ఈనాడు, హైదరాబాద్‌: రెండు నెలలుగా వేతనాలు లేక ఇబ్బంది పడుతున్న అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సీఎం రేవంత్‌రెడ్డికి సోమవారం లేఖ రాశారు. ‘అంగన్‌వాడీ టీచర్లకు రూ.13,650, హెల్పర్లకు రూ.7,800 మాత్రమే ప్రతి నెలా చెల్లిస్తున్నారు. అతి తక్కువ వేతనాలనూ సకాలంలో చెల్లించకపోవడం సరైంది కాదు. తక్షణమే వేతన బకాయిలు చెల్లించి..వేతనాల పెంపుపైనా నిర్ణయం తీసుకోవాలి’ అని లేఖలో తమ్మినేని సీఎంకు విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని