ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌కు నేనే ప్రత్యక్ష బాధితుడిని

ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌కు తానే ప్రత్యక్ష బాధితుడినని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ పీవీ రమేశ్‌ తన ఎక్స్‌ ఖాతాలో సోమవారం ట్వీట్‌ చేశారు. చనిపోయిన తన తల్లిదండ్రులకు చెందిన కృష్ణా జిల్లా విన్నకోటలోని పట్టాభూములను మ్యుటేషన్‌ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని పేర్కొన్నారు.

Updated : 07 May 2024 07:09 IST

విశ్రాంత ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ పీవీ రమేశ్‌ ట్వీట్‌

ఈనాడు, అమరావతి: ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌కు తానే ప్రత్యక్ష బాధితుడినని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ పీవీ రమేశ్‌ తన ఎక్స్‌ ఖాతాలో సోమవారం ట్వీట్‌ చేశారు. చనిపోయిన తన తల్లిదండ్రులకు చెందిన కృష్ణా జిల్లా విన్నకోటలోని పట్టాభూములను మ్యుటేషన్‌ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని పేర్కొన్నారు. ఆ దరఖాస్తును తహసీల్దార్‌ తిరస్కరించారని, ఆర్డీవోకి పోస్టులో పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి ఇచ్చేసినట్లు వెల్లడించారు. చట్టం అమల్లోకి రాకముందే తన తల్లిదండ్రుల భూములపై తనకు హక్కులు నిరాకరించారని, ఐఏఎస్‌ అధికారిగా 36 ఏళ్లపాటు ఏపీలో సేవలందించిన అధికారి పరిస్థితే ఇలా ఉంటే, సామాన్య రైతుల దుస్థితిని ఊహించలేమని ట్వీట్‌లో పేర్కొన్నారు.


సీఎంఓలో పనిచేసిన ఐఏఎస్‌ అధికారి భూమికే దిక్కులేదు

తెదేపా అధినేత చంద్రబాబు

పీవీ రమేశ్‌ పోస్టుపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. సీఎంఓలో పనిచేసిన ఐఏఎస్‌ అధికారి పరిస్థితే ఇదైతే..సామాన్యుడి పరిస్థితి ఏంటో ఊహించాలని ఎక్స్‌లో సోమవారం పేర్కొన్నారు. ‘‘ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం అమల్లోకి వస్తే మీ భూమి, ఇల్లు, స్థలం మీది కాదు’’ అని ప్రజల్ని హెచ్చరించారు.

‘‘ఆస్తి కొట్టేస్తే ఊరుకోవడానికి మీ చెల్లెలు అనుకున్నారా? కష్టపడి సంపాదించిన ఆస్తి, వారసత్వంగా వచ్చిన భూముల్ని ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌తో లాక్కోవాలని చూస్తే జనం మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు’’ అని సీఎం జగన్‌ను తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎక్స్‌ వేదికగా హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని