కళాశాల గురువును కలిసిన కేసీఆర్‌

జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి సోమవారం సాయంత్రం నిజామాబాద్‌ జిల్లాకు బయలుదేరేముందు తన గురువైన చరిత్రకారుడు డాక్టర్‌ జైశెట్టి రమణయ్య ఇంటికి కేసీఆర్‌ వెళ్లారు.

Published : 07 May 2024 07:36 IST

జగిత్యాల, న్యూస్‌టుడే: జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి సోమవారం సాయంత్రం నిజామాబాద్‌ జిల్లాకు బయలుదేరేముందు తన గురువైన చరిత్రకారుడు డాక్టర్‌ జైశెట్టి రమణయ్య ఇంటికి కేసీఆర్‌ వెళ్లారు. సిద్దిపేటలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కేసీఆర్‌ ఇంటర్‌ చదువుతున్న సమయంలో రమణయ్య చరిత్ర అధ్యాపకుడిగా పనిచేశారు. ఈ సందర్భంగా వారు కొద్దిసేపు ముచ్చటించారు. తాను రచించిన పుస్తకాలను కేసీఆర్‌కు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, ఎమ్మెల్యే డాక్టర్‌ ఎం.సంజయ్‌కుమార్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ వసంత తదితరులున్నారు.

 కేసీఆర్‌ సోమవారం సాయంత్రం జగిత్యాల నుంచి నిజామాబాద్‌ వెళ్తుండగా చల్‌గల్‌ వద్ద ఎన్నికల బృందం ఆయన బస్సును ఆపి తనిఖీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని