చదువు కోసం... ప్రమాదం వెంట ప్రయాణం

చిత్రంలోని విద్యార్థులంతా ఏదో సరదాకి రైలు పట్టాలపై నడుచుకుంటూ వస్తున్నారనుకుంటే మీరు పొరబడినట్లే. అత్యంత ప్రమాదం అని తెలిసినా కూడా

Published : 08 Aug 2022 05:37 IST

ఈనాడు, మహబూబ్‌నగర్‌ - న్యూస్‌టుడే, మదనాపురం: చిత్రంలోని విద్యార్థులంతా ఏదో సరదాకి రైలు పట్టాలపై నడుచుకుంటూ వస్తున్నారనుకుంటే మీరు పొరబడినట్లే. అత్యంత ప్రమాదం అని తెలిసినా కూడా రోజూ వీరంతా చదువుకోవడానికి రైలు పట్టాల మీదుగా వెళ్తుంటారు. వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని నెల్లివీడు, నర్సింగాపూర్‌, కొన్నూరు, ద్వారకానగర్‌ గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ఈ గ్రామాలలోని ఆరో తరగతి నుంచి ఇంటర్‌ చదివే విద్యార్థులంతా మండల కేంద్రం మదనాపురానికి రావాల్సిందే. ఈ గ్రామాలన్నీ దానికి అయిదు కిలోమీటర్లకు మించి దూరం ఉండటంతో అడ్డదారిని ఎంచుకున్నారు. ఇలా రైలు పట్టాల మీదుగా నడిచి పాఠశాలలు, కళాశాలలకు వెళ్తున్నారు. ఇలా వెళ్లడం వల్ల సుమారు 2 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని చెబుతున్నారు. ఆర్థిక స్తోమత ఉన్న చిన్నారులు ఆటోలలో వెళ్తుండగా సుమారు 60 మంది వరకు పేద పిల్లలు రోజూ ఇలా పట్టాలు దాటుతున్నారు. గతంలో చాలా సార్లు ఈ గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు ఆర్టీసీ అధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని